మాలతి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
కి స్పందనగా.
నమస్కారం. సంతోషమండి మీవివరణకి. ధన్యవాదాలు.
మెచ్చుకోండి
కి స్పందనగా.
అవును. గొప్పవారికి గొప్పవాడు. నేనిక్కడ ప్రస్తావిస్తున్నది ఘోరమైన అగ్నిశిఖలలో చిక్కుకుని, ఆస్తిపాస్తులన్నీ నాశనం అయి, దిక్కు లేకుండా ఉన్నవారిగురించి. వారికి సాయం చేసినప్పుడు చెప్పండి. సంతోషిస్తాను.
మెచ్చుకోండి
కి స్పందనగా.
చాలా సంతోషం లక్ష్మీ రాఘవగారూ. నాకూ మీలాటి స్పందనలు రాయాలన్న ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆమధ్య రాయడం మానేసేక, సౌమ్య రాయండి అని అడకపోతే ఇవి మొదలు పెట్టేదాన్ని కాదు. ధన్యవాదాలు.
మెచ్చుకున్నవారు
కి స్పందనగా.
భలేవారే. ఏదో పది పనులున్నప్పుడు, ఒక పనిలో పడి మరోపని మర్చిపోతాం. అదేమంత నేరం కాదని నాఅభిప్రాయం. ఏదోలెండి సరదాకి రాసేను. మీవ్యాఖ్యకి ధన్యవాదాలు.
మెచ్చుకున్నవారు
కి స్పందనగా.
సంతోషం లక్ష్మీరాఘవగారూ, మీస్పందనకు
మెచ్చుకోండి
ఉచితంగా ఇక్కడ అందుబాటులో పెట్టినందుకు ధన్యవాదములు,
వనజగారూ,
ఏనుగు అంబారీ కథ చదివేను.
నేను 46ఏళ్ళగా ఈదేశంలో ఉన్నా సమాజంలో ఎవరితోనూ కలవలేదు కనక నాకు చాలా విషయాలు తెలీవు. నేను వచ్చినకొత్తలో ఇక్కడ డాలర్లంటే బోలెడు రూ. అని అనుకుంటారనుకున్నాను కానీ అది ఇంకా మారలేదని మీకథ చూసేకే అర్థమయింది. కూటికి పేదయితే కులానికి పేదా అన్న సామెతని మీరు ప్రత్యేకమైన పద్ధతిలో వాడడం నాకు నచ్చింది. అలాగే "మీనాన్నకి ఆమెపై ఎందుకంత జాలి"లాటివి కూడా సూక్ష్మంగా ఆలోచిస్తే తప్ప తోచవు. మీరు బాగానే పసి కట్టినట్టున్నారు మనిషితత్వం. నిజానికి మీరు రాసిన ఒకొక సంఘటన విడిగా మరో మంచి కథ కాగలదు. ఒక నవలకి సరిపడా సరుకుంది ఈ కథలో.
మంచికథ. బహుమతి గెలుచుకోగలకథ. మరొకసారి అభినందనలు.
నా మనసు మురుస్తుంది చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ… — బంగాళాఖాతం హోరూ, ఎవరిఆశలు ఆడియాసలుచేస్తుందోనన్న ఆందోళనలూ – వీటిమధ్య మీ మనసు మురిసిపోవడం అసాధారణమయిన కాన్సెప్ట్. చక్కగా రాసేరు. చిన్నకవితలా ఉంది. అభినందనలు. మీకు నాకథ నచ్చినందుకు కూడా సంతోషం ఇక్కడే వెలుబుచ్చుకుంటాను.
– మాలతి