విన్నకోట నరసింహా రావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
మీ జ్ఞాపకాలు రిపీట్ అవుతున్నాయి గానీ ఆసక్తికరంగానే ఉంటున్నాయి.
మొన్న కశ్మీరులో జరిగిన అమానుష దాడి మీద సీనియర్ పాత్రికేయుడిగా ఒక పోస్ట్ వ్రాస్తారేమో అని ఎదురు చూసాను కానీ పోస్ట్ రాలేదు. ఇప్పటికైనా వ్రాసి పోస్ట్ చేస్తే బాగుంటుందని నా మనవి.
శోచనీయమైన విషయమేమిటంటే తెలుగు బ్లాగులోకంలోని ముస్లిమ్ బ్లాగర్ లు ఎవరూ కూడా ఈ అంశంపై పోస్ట్ వ్రాసినట్లు లేదు. మౌనం అర్థాంగీకారం అనుకోవాలా ? తాము నివసిస్తున్న దేశంలో జరుగుతున్న సంఘటనల పట్ల స్పందింపు కూడా ఉండదా ? వీరినా మనం భాయీ-భాయీ అనేది ?
కేంద్ర ప్రభుత్వ శాఖలైనా / సంస్థలైనా / ఉద్యోగులైనా (బహుశః మిలటరీ మినహా అనుకుంటున్నాను ???) స్ధానిక ప్రభుత్వ అధికారుల సహకారం కోరాలే గానీ వారితో తలపడడం అభిలషణీయం కానేరదు - అందునా రెవిన్యూ, పోలిసు వారితో. స్థానికంగా వ్యవహారాలు, శాంతిభద్రతలు చూసుకునేది స్ధానిక అధికారులే. కనుక వారిదే పై చేయి గా ఉంటుంది సాధారణంగా.
—————
// “ఖాన్ గారి ఈ భావజాలంతో ఏకీభవించాల్సిన అవసరం వుందని కాదు ”//
ఏం, ఎందుకని “కాదు” ? అవసరం పూర్తిగా ఉందని నేను నమ్ముతున్నాను. లేకపోతే ఎవరికి వారికి ఇష్టారాజ్యం అయిపోయింది దేశంలో. హైదరాబాదులో పని చేసిన పోలీస్ కమీషనర్లలో - నన్నడిగితే - ఖాన్ గారిది చెప్పుకోదగిన వ్యవహారశైలి.
అమెలాంటి సాధ్వీమణికి పునిస్త్రీ మరణం లభిస్తే సముచితంగా ఉండేదేమో ? సరే, ఇవేవీ మన చేతుల్లో లేని విషయాలు కదా.
మీకందరకూ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
దివంగత ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకుంటున్నాను 🙏.
శర్మ గారు,
వ్రాసినవారెవరో బాగా రిసెర్చ్ చేసి / పరిశీలించి వ్రాసినట్లున్నారు, అద్భుతః 👏🙂.
మరొక వర్గాన్ని మరచినట్లున్నారు - వారే ఔత్సాహిక నటులు, గాయకులు. ఇప్పుడైనా తమ విద్య చూపిద్దామని తంటాలు పడుతుంటారు 🙂.
పైనిచ్చిన వర్గీకరణలో Sl No. 2, 8 అత్యధికుల్లో కనిపిస్తారని నా అభిప్రాయం.
శర్మ గారు,
మీ ఏ.సి వ్యవహారం నాకర్థం కావడం లేదు. వేసవి ప్రారంభంలోనే ఆ సోకాల్డ్ “టెక్” ని పిలిచి మీ ఇంట్లోని ఏ.సి. లను సర్వీసింగ్, అవసరమైన రిపేర్లు చేయించానని మీరన్నట్లు జ్ఞాపకం.
మరి అంత డబ్బు పోసి చేయిస్తే ఒక్క వేసవికి కూడా సరిగ్గా పని చెయ్యవా? చేసిన రిపేరు అంత సొంపుగా ఉందా ? ఇప్పుడు మళ్ళీ పదివేల రూపాయల ఖర్చేమిటి? ఆ టెక్ కి మీరు ఓ ATM లాగా కనిపిస్తున్నారేమో ?
ఏం లాభం, ఇప్పుడు “టపాలు” పేజీ ఎడమవైపు తెల్లమొహం వేసిందిగా. ఇంత వరకు కనీసం బిగుసుకు పోయిన పాత టపాలైనా కనిపించేవి.
సర్లెండి, మొత్తం బాగు పడుతుందనే శర్మగారి ఆశావాదాన్ని నమ్ముకుందాం.
నిజమే, గోవిందా లాగానే ఉంది.
“మాలిక” టపాల పేజీలో ఎడమ ప్రక్క బిగుసుకుపోయి చాలా కాలం అయింది, నిర్వాహకులు గమనించారో లేదో తెలియదు. ఇప్పుడు వ్యాఖ్యల పేజీలో కుడి ప్రక్క తెల్లకాగితం అయింది. మెల్లిగా మూలన పడడానికి సూచనలా ? దురదృష్టకరం.
ఏమి చెప్పుదు గురునాథా 😒 !
రిటైరయిన వాళ్ళ పరిస్థితి కూడా మామూలు కస్టమర్ కన్నా ఏం మెరుగ్గా లేదు. కాబట్టి మీరు రాంగ్ నంబర్ ని (అంటే నన్ను) అడుగుతున్నారు.
అయినా స్వయానా భండారు వారి అన్నగారే మీరన్న “సేఠు బ్యాంకు” లో పెద్ద సేఠుల్లో ఒకరిగా పరిగణించబడే ఉద్యోగం చేసారు, శ్రీనివాసరావు గారు వారికి చెప్పుకుంటారేమో లెండి.
🙏
హాస్పిటల్లో పడి, రోజుల తరబడి అవస్థ పడకుండా ఒక అరగంటలో దాటిపోయారు అనే అనాలేమో? గుండె నొప్పి వచ్చిన వారు చివర్లో బాత్ రూమ్ కు వెడ్తాననడం పరిస్థితి sink అవుతున్నట్లు సూచన అంటారు (మా తల్లి గారి మరణం ఆధారంగా చెబుతున్నాను). 🙏
వాటిని బ్యాంకులకు తొడిగారు.
ధన్యజీవులు గరిమెళ్ళ వారు 🙏.
——————-
పద్మపురస్కారాలు ఎంత లోపభూయిష్టంగా తయారయ్యాయో చూస్తున్నాంగా ? ప్రాంతీయం, సామాజికం వర్గం, సిఫార్సు చేసేవారి బలం వగైరా వగైరా రకరకాల లెక్కలు. ఉంటాయేమో ? అన్నవరపు రామస్వామి వంటి విద్వాంసుడికి 90 యేళ్ళ వయసు దాటేటంత వరకు ఇవ్వలేదంటే ఏం అనుకోవాలి ! బాపు గారికి వారు పోవటానికి ఒక సంవత్సరం ముందా (80 యేళ్ళ వయసులో) ? అంతవరకు ఆయన ప్రతిభ కనబడలేదా? ముళ్ళపూడి వారికి అసలిచ్చారా ? గాయని ఎస్.జానకి గారు బెస్ట్ - నాకక్కరలేదు అన్నారు.
బాలకృష్ణ గారి విషయంలో టిటిడి వారు గట్టిగా ప్రభుత్వాన్ని పట్టుబట్టవలసింది. ఏపీ ప్రభుత్వం మరింత గట్టిగా కేంద్రానికి సిఫారసు చేసుండ వలసింది.
తమిళనాడు ప్రభుత్వాన్ని చూడండి తమకు కావలసినది ఎలా సాధించుకుంటారో. మంగళంపల్లి వారికి తమిళనాడు కోటాలో వచ్చినట్లుంది గానీ తెలుగు ప్రభుత్వాలు ఏమీ చేసినట్లు లేదు. అలాగే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా పద్మవిభూషణ్ తమిళ నాడు కోటాలోనే వచ్చిందనుకుంటాను.
అప్పుడప్పుడు గిరీశం గుర్తుకు రాక మానడు.
ఇక లాభం లేదు, రాజారావు మాస్టారు. బండిదొర గారి పోకిరీ రాతలు ఎక్కువవుతున్నాయి, బండిదొరసాని గారికి చెప్పెయ్యాలి మీ ఆయన ఇలాంటి కవితలు వ్రాస్తున్నాడు, జాగ్రత్త అని.
🙂🙂
🙂🙂👌
రంగాజమ్మ గారి ప్రసిద్ధ పద్యమా, మాస్టారూ 🙂👏👏🙏 ? అతిశయంగా ధ్వనిస్తుంది గానీ మహా సొగసైన పద్యంతో దీటుగా జవాబిచ్చింది ఆవిడ.
బండి వారూ, పాట బాగా అల్లారు 👌.
ఈ వయసులో కూడా మరింత ఉర్రూతలూగించే పాట - అదేనండి 1980 ల హిందీ చిత్రం “ఖుర్బానీ” (Qurbani) లో నాజియా హసన్ (Nazia Hasan) (పాపం పిల్ల చిన్న వయసులోనే కేన్సర్ కు బలయిపోయింది) పాడి, సినీగీత ప్రియుల్ని అదరగొట్టిన - “ఆప్ జైసా కోయీ” పాటకు మీ “స్వేచ్ఛానువాద”పు గీతం తయారు చేయరాదా, ఆనందిస్తాం 👍?
https://youtu.be/SMTEuX46XTc
మాస్టారూ, “కాపుదొర” గారికి లేని ఉద్దేశాలు ఆపాదించకండి.
🙂🙂
బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు, మురళి గారు 💐(x16).
మీ రచనలు ఇలాగే వర్ధిల్లాలని మా ఆశీస్సులు 🤲.
మహానుభావుడు 🙏.
వారి ఆత్మకు సద్గతి ప్రాప్తించాలవి కోరుకుంటున్నాను 🙏.
// “ మునుపు ఏ ఆత్మకథ లోనూ ఇలా ఫోటోలు వాడడం జరగలేదని కూడా ఆయనే చెప్పారు “ //
ఇది కరక్ట్ కాదేమో? ఆత్మకథలో ఫొటోలు ఎందుకు వాడరండి, వాడతారు.
మురళి గారు, ఈ పుస్తకం ఏ సంవత్సరంలో ప్రచురించబడింది ? మీకెలా / ఎక్కడ దొరికింది ? త్రివేణి పబ్లిషర్స్ కే ఫోన్ చేసి అడిగితే ఓ కాపీ దొరకచ్చమో, అడిగి చూస్తాను.
కెరీర్ తలకిందులైతే కొంత మంది తట్టుకోలేరేమో మురళి గారూ.
చుట్టూ చేరి తప్పు దోవ పట్టించే కుట్రదారుల మాటల్లో పడడం కూడా ఒక కారణం. తద్వారా తగులుకునే దుర్వ్యసనాలు, వాటిల్లో మునిగి తేలుతూ వృత్తి కమిట్ మెంట్స్ ని నిర్లక్ష్యం చెయ్యడం మరో బలమైన కారణం. అలనాటి అందాల నటుడు రామ్మోహన్ మరో ఉదాహరణ. కొంతవరకు స్వయంకృతాపరాధాలు.