Giridhar Pottepalem తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Hi అండి, దామరమడుగులో నేను చదివింది 2nd, 3rd, 4th classes అంతే. తర్వాత కావలి కి నాన్న ట్రాన్స్ఫర్ అవటంతో వెళ్ళాము. అప్పటికింకా రోడ్డు దగ్గర స్కూల్ కట్టలేదు.
ఓ అవునా, మీ కామెంట్ లో పేరు లేదు. అదే స్కూల్ ఫీలింగ్ తో నా ఈ పోస్ట్ ఒకరు చదివారు అన్న ఫీలింగ్ మాత్రం అద్భుతం నాకు.
థ్యాంక్యూ కళాసాగర్ గారూ.
అమెరికా, బోస్టన్ దగ్గర్లో నివాసం. బొమ్మలు చూసి, నా మాటలు చదివి స్పందించారు, చాలా సంతోషం. విజయవాడ లో ఆరేళ్ళు కాలేజి కెళ్ళాను, ఆంధ్ర లొయోలా లో ఇంటర్, సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి లో B.Tect in Computer Science చేశాను. అలా విజయవాడ బాగా తెలుసు. మీ https://64kalalu.com/ ఇదివరకు చూశాను, మళ్ళీ చూస్తాను.
కళాసాగర్ గారూ, ధన్యవాదాలండీ.
అవును గత 28 ఏళ్ళుగా అమెరికాలోనే నివాసం.
థ్యాంక్యూ నరసింహా రావు గారూ! నిజమే ఇంద్రధనుస్సు పూర్తి అయి ఉండేది ఆ రెండు రంగులు కూడా అద్ది ఉండి ఉంటే. ప్రోత్సాహం తో కూడిన మీ కామెంట్ చూసినపుడల్లా చాలా సంతోషం వేస్తుంది.
థ్యాంక్యూ అండీ, నిజమే ఇదివరకే వచ్చుంటే బాగుండేది, ఇన్నేళ్ళు పట్టింది.
గిరిధర్ గౌడ్ మొదటిసారి డా||భార్గవి అని పరిచయం మా ఇంటికి వచ్చినపుడు తను రాసిన రవీంద్రనాథ్ గారి "గీతాంజలి" అనువాదం పుస్తకం కి బొమ్మలు వేశారు, ఆ పుస్తకం నాకిచ్చారు. అప్పుడే మొదటిసారి విన్నాను, మంచి ఆర్టిస్ట్.
Thanks for sharing the link.
ఇది చంద్ర గారి 70వ జన్మదిన ప్రత్యేక సంచిక. పుస్తకం లోపల అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో అని ఉంది.
ముద్రణ మాత్రం - హిమాలయ గ్రాఫిక్స్, చిక్కడపల్లి, హైదరాబాద్.
థ్యాంక్యూ అండీ!
మంచి ఛందస్సుతో ఆసుపద్యం చెప్పేశారు. ఇది ఏ కోవకు చెందిన పద్యమో గుర్తించలేనిప్పుడు.