Nrahamthulla తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
లిపి లేని తుళు కన్నడ ఆశ్రయం పొందింది. ఉన్న లిపిని బాగు చేసుకోలేక తెలుగు ప్రజలు ఆంగ్ల లిపినే ఆశ్రయించారు. లిపిక్లేశాలు తెలుగుకు ప్రతి బంధకాలుగా ఉన్నాయని శ్రీ శ్రీ, వేటూరి ప్రభాకర శాస్త్రి ఆనాడే చెప్పారు.దిక్కు లేని భాషలకు ఇంగ్లేషే దిక్కు అన్నట్లు అయ్యింది ప్రపంచం. తెలుగు సాధికార భాషా సంఘాన్ని ఇప్పటికైనా ప్రారంభిస్తారా?మాదీ ఆంగ్ల ప్రదేశే అందామా?
కొందరు ఉర్దూ ముస్లిములు తెలుగు మాత్రమే వచ్చిన ముస్లిములపట్ల చూపే వివక్షను విడనాడాలని మత పెద్దలు జుమ్మా ప్రసంగాలలో బోధించాలి.
దూదేకుల ముస్లిముల్ని దళిత ముస్లిములుగా గుర్తించాలని గతంలో మజ్లిస్ పార్టీ అసెంబ్లీలో డిమాండ్ చేసింది.దళితుల స్థాయిలో ఉన్న దూదేకుల వారినికూడా కనీసం బీ.సీ.ఇ గ్రూపులో కలిపినా ఒకే గుంపులో ఉండేవాళ్ళు.సమాన సాంఘిక గౌరవం,సమాన భాషా గౌరవం,ఆర్ధిక రాజకీయ ఔన్నత్యం మెహతార్,దూదేకుల కులాలకు కూడా క్రమేణా కలగాలని ఆశిద్దాం.