nmrao bandi తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
రాజారావు గురువు గారూ నా పాట ఓ ప్రసిద్ధ పద్యాన్ని మీకు జ్ఞప్తికి గుర్తుకు తేవడం నాకు ఆనందం కలిగించింది. అదో మేరకు నా పాటకు సార్థకతే. గడుసరినన్న మాట మరింత కితకితలు పెట్టి మహదానందం కలిగించింది. వినరా గారూ మీరన్న పాట ఇప్పుడు నేను వ్రాయగలనో లేదో, ఎందుకంటే ప్రస్తుతం పాటలల్లడం తగ్గిపోయింది. ఇంట్రెస్ట్ కలగడం లేదు. పై పాట కూడా పాడించి, యూట్యూబులో పోస్ట్ చేసి సంవత్సరం పైనే గడిచింది. ఇంట్రెస్ట్ లేక ఇన్నాళ్ళూ బ్లాగ్ లో పోస్ట్ చెయ్యలేదు. అలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. వీలు వెంబడి మెల్లగా పోస్ట్ చెయ్యాలి. వ్రాసినా పాడేవాళ్ళు దొరకక ఇబ్బందిగా ఉంది సర్.
జిలేబీ గారూ మీరు కోరుకున్నట్లే వేదాంతం దరిదాపులోనే ఉన్నాన్లెండి.
స్పందనకు మీ ముగ్గురికీ ధన్యవాదాలు 🙏🙏🙏
పెద్దలందరకూ వినమ్ర వందనాలు. జవాబు లోని జాగుకు క్షంతవ్యుడిని. బ్లాగు మొహం చూసి చాలా కాలమైంది అందువల్లనే అందుకోలేకపోయాను.
జిలేబీ గారూ, పేరడీలు రాసింది తక్కువేనండి. రాస్తున్న ప్రతి ఒక్కటీ పేరడీ కాదండి. రాసిన కొన్ని అనువాదాలు తప్ప మిగిలిన అన్నీ స్వంత గీతాలేనండి. కాకపొతే ఉన్న ట్యూన్స్ కి వ్రాశాను, స్తున్నాను - అంతే. అలా కాకుండా మీరన్నట్లుగా రాసినవి కూడా చాలానే ఉన్నాయి, రాసిన వాటిల్లో. అయినా ఎలా రాసినా ఉపయోగమేముందండి - diarising తప్ప! సుహృద్భావనానికి కృతజ్ఞతలు.
మాస్టారు గారికి, మందు పాటలు, పొందు పాటలు ఎందుకనో వెనక్కెళ్ళి పోయాయండీ. పెద్దగా, రాయడానికేమీ, బుద్ధి పుట్టడం లేదు. మే బీ, గుజ్జు (ఉన్నదేదో) ఇంకి పోయినట్లుంది.
హుషారు కూడా షికారుకెళ్ళి పోయింది. అదే కారణం - చక్కర్లు కొట్టడం తగ్గిపోవడానికి.
ఆరా లోని ఆప్యాయతకి ధన్యవాదాలు.
బోనగిరి గారికి, వినరా వారికీ నమస్సులు ... 🙏🙏🙏🙏
మేడం గారూ, ఇవి నా కొంటె ముచ్చట్లు ...
(ఛందస్సుకు నాకు చుక్కెదురని
గమనించ ప్రార్ధన)
వంట దినుసులు శొంఠి ఘాటులు
పంట అదమగ గంటు కుదిరెను
ఇంటి వంటలు తింటి ముదమున
ఒంట బట్టగ అంటి రసములు
ఇంటి వంటలు ఒంట బట్టెను
అంటి అదునుగ శొంఠి ఘాటులు
వంట దినుసులు పంట కుదరగ
గంటు పెట్టుచు తింటి ముదమున
::))
మనదో సిగ్గులేని జాతి. రాష్ట్రాన్ని కర్కశంగా చీలుస్తుంటే పట్టని జాతి, విభజన హామీల్లో ఇవ్వాల్సిన వాటిలో కనీసం 10 శాతం ఇవ్వకపోయినా చీమ కొట్టినంత కూడా బాధ లేని వాళ్ళం, ఏమీ ఇవ్వకపోయినా అన్నీ ఇచ్చాం అనే కేంద్రాన్ని, బలగాన్ని, ఆదరించి జేజేలు కొట్టే అలగా జనం మనం. తన రాష్ట్రం లోని ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు లు రెండూ నత్త నడక నడుస్తున్నా, ఆ రెంటినొదిలేసి, ఆంధ్ర పై పడి, సుమారు వందేళ్ల చరిత్రున్న ఆంధ్ర బ్యాంకు ని చిదిమేసి యూనియన్ కి తగిలిస్తే, సీతారామన్ మా ఆంధ్రా కోడలు అని మురిసిపోయి, తిలకం దిద్ది, చీరె, సారె పెట్టి చంకలు గుద్దుకునే జాతి. ఆఫ్టర్ అల్ జల్లికట్టు అనే ఓ ఆట నాపితేనే కేంద్రం కళ్ళకి ఉల్లిగడ్డని రుద్ది, పిల్లి మొగ్గేయించిన శూరులతో మనకేంటి పోలిక సార్. అంతెందుకు, తెల్లారి లేసిన కాణ్ణించి 90 శాతం తెలంగాణ వార్తలతోనే మనను వాయగొడుతున్నా, తెలుగు సినిమా భాష మొత్తాన్ని తెలంగాణీకరించినా, గుడ్లప్పగించి చూస్తూ, చెవులప్పగించి వింటూ పాప్కార్న్ నవులుకుంటున్న "చూడు పిన్నమ్మ" జాతి మనది. మనకెందుకు సారూ అలాంటి పట్టింపులూ, నిట్టూర్పులు?
అంతెందుకు, ఒక రాష్ట్రం లోని అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ, కూడబలుక్కోకుండానే, కేంద్రం లోని ఒకే ఒక పార్టీ కి తొత్తులై స్వప్రయోజనాలు తప్ప, రాష్ట్ర హితం పట్టించుకోని వానపాము నాయకులున్న రాష్ట్రం మనది కాక మరోటుందా, చెప్పండి?
కాలం మరలు దూరాలు విసిరేసినా, విరిసే భావాలు పలుకరిస్తూనే ఉంటాయి. మనసనుసరిస్తూనే ఉంటుంది 🙂🙏...