srinivasrjy తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

The Rich Monk World;srinivasrjy

12 కాదండీ .

డిసెంబర్ రెండో ఆదివారం ... "తెలుగు బ్లాగుల దినోత్సవం" అని గుర్తుపెట్టుకునే వారు ఇంకా ఉన్నారంటారా!!!

13 February 2026 10:03 PM

తెలుగు టెక్నాలజీ బ్లాగ్!!!;srinivasrjy

@శ్యామలీయం
ఇక్కడ నా అభ్యంతరం ఆలయాలలో ఉపాలయాలు ఏర్పాటు అంగీకారం/తిరస్కరణ మీద కాదు.. కోట్లాది భక్తులు సాక్షాత్తూ దేవంగా కొలిచే షిర్దీ సాయిబాబా వారిని కించపరచడం కోసం.
సనాతన ధర్మం ప్రతీ హిందూ పాటించాలి అనే విషయంలో కూడా చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఇక్కడ సనాతన ధర్మం నుండి హిందూ మతోన్మాదవాదులను వేరుచేసి మాత్రమె రాసాను. "సనాతన ధర్మం" కోసం తెలియని వారుకూడా ఆ పేరు వాడుకుంటున్నారు. ఇది కూడా మతమౌఢ్యమే!
'హిందూ ధర్మం' లో యుగానికి తగ్గట్టు, కాలానికి తగ్గట్టు, పరిస్థితులకు తగ్గట్టు క్రొత్త మార్పులు సంతరించుకోవడం అవసరమే, లేకపొతే ధర్మం పది కాలాల పాటు.. కొన్ని యుగాలపాటు నిలబడదు.
షిర్డీ సాయిబాబా వారిని ఎలా పూజించాలో వారు చెప్పలేదు.. ఎవరికీ తోచినట్లు, ఎవరికీ వీలుగా వారు పూజిస్తున్నారు అంటే అది ఆనందపడాల్సిన విషయమే. నిజం చెప్పాలి అంటే మనకు ఉన్న ముక్కోటి దేవతలూ కారణ జన్ములే. వారిలో ఏ ఒక్కరినీ దైవం కాదు అంటే సమంజసమా...
సంప్రదాయిక దేవతామూర్తులు అన్నారు.. అది ఎలాగ? దేవతా మూర్తులలో కూడా సాంప్రదాయ మూర్తులు ఉన్నారా?
ఒకవైపు శివాలయంలో కూడా వైష్ణవ ఉపాలయాలు ఉంటున్నాయి. వైష్ణవ ఆలయాల్లోనూ శైవ ఉపాలయాలు ఉంటున్నాయి. అభ్యంతరం ఎందుకు?
సనాతనం పాటిస్తే తప్పులేదు. దాన్ని అందరిమీదా రుద్దాలని అనుకుంటే అదే మతోన్నాదం.


02 January 2026 2:28 PM

అంతర్యామి - అంతయును నీవే;srinivasrjy

Ok

08 December 2025 11:59 AM

విశ్వ చైతన్య శక్తి;srinivasrjy

చక్కని కథతో మరణం యొక్క గొప్పతనాన్ని వివరించినందుకు ధన్యవాదాలు

27 September 2025 9:00 PM

The Rich Monk World;srinivasrjy

// అసలు యూనియన్‌తో సంబంధం లేకుండా, పనిచేయడానికి ఎందరో పనిలేకుండా ఉన్నారు. //

అవును కొందరు స్నేహితులు కలిసి నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్మ్స్ బడ్జెట్ లేకుండానే ఎంతో విజయం పొందుతున్నాయి. వాటి క్వాలిటీ నేటి సినిమాలకు తీసిపోకుండా ఉంటోంది.
అదే స్పూర్తితో సినిమాలు తీయొచ్చు .. కానీ ఇలాంటి సినిమాలకు థియేటర్లు దొరకకుండా చేస్తున్నారు. అందుకే ఒటీటీ, యూట్యూబ్ లను నమ్ముకుంటున్నారేమో అని సందేహం !

08 August 2025 10:47 AM

The Rich Monk World;srinivasrjy

"బ్లాగింగ్ ఒక అద్భుతమైన సాధనం. నమ్మరు కాని, బ్లాగింగ్ నిజంగా మనల్ని వేరే ఎడిక్షన్స్ జోలికి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా. "

ఇది నిజం!

22 July 2025 10:10 PM

తెలుగు టెక్నాలజీ బ్లాగ్!!!;srinivasrjy

@sarma

సార్ .. తెలుగు బ్లాగులు మళ్ళీ పుంజుకుంటాయి అనేది అసాధ్యం ..
ఇప్పుడు ఆగ్రిగేటర్ లో క్రొత్తగా మార్పులు చేసినా మనలాంటి వారి సౌలభ్యం కోసం మాత్రమే!
ఏదో గడిచినంత కాలం ముందుకు తీసుకు వెళదాం అనే తపనే తప్పితే .. ఏం చేసినా "వృధా ప్రయాస"

23 June 2025 5:14 PM

తెలుగు టెక్నాలజీ బ్లాగ్!!!;srinivasrjy

శ్యామలీయం గారూ,

నమస్తే .. మీరు చెప్పిన మార్పులు పరిశీలిస్తాను.

3వ పాయింట్ అర్ధం కాలేదు!!

ఇంకో విషయం మీ బ్లాగు "శ్యామలీయం" వీక్షకులకు అందుబాటులో లేని కారణంగా శోధిని నుండి తొలగించబడింది..

22 June 2025 8:51 PM

The Rich Monk World;srinivasrjy

మనోహర్ గారూ.. మీ బ్లాగుకి కస్టమ్ డొమైన్ సెట్ చేయడం చాలా తేలిక .. వివరాలకు https://www.hostinger.in/tutorials/how-to-point-a-domain-to-blogger
ఒకసారి చూడండి .. కష్టం అనుకుంటే మీ నంబర్ నాకు మెయిల్ చేయండి .. srinivasrjy@gmail.com

04 May 2025 11:52 PM

ఆండ్రాయిడ్ కబుర్లు...;srinivasrjy

ok.. I will remove it..thx for feedback

15 September 2011 7:33 PM

ఆండ్రాయిడ్ కబుర్లు...;srinivasrjy

సత్తిబాబుగారూ, ప్రస్తుతానికి మనం ఆండ్రాయిడ్ లో తెలుగు ఫాంట్ ఇన్స్టాల్ చేయలేం. ఒకవేళ మీరు ఒపేరా మినీ బ్రౌజరు కనుక ఉపయోగిస్తుంటే ఆ బ్రౌజరు ద్వారా తెలుగు ఫాంట్ ని చదవవచ్చు . దీనికి మీరు ఓ చిన్న సెట్టింగ్ చేయవలసి వస్తోంది.
మీ బ్రౌజరు లో about:config అని అడ్రస్ బార్ లో టైపు చేసి, తర్వాత వచ్చే స్క్రీన్ సెట్టింగ్స్ లో use bitmap fonts for complex scripts అనేచోట yes లా చేంజ్ చేయండి.
ఈ పోస్ట్ మాకు ఉపయోగపడిందని ఆశిస్తూ..

14 September 2011 8:32 PM

యువకుడు;srinivasrjy

You can listen telugu radios and 1000's of radios at:
http://4feed.co.cc/radio.html

10 November 2010 10:57 PM