చింతా రామ కృష్ణా రావు. తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
శ్రీ చింతా రామకృష్ణ రావు గారిపై, వారి "శ్రీ లక్ష్మీ సహస్రనామ వివరణ" కు ఈ పద్యం: రచన భద్రాచలం వాణీగారు.
ఉత్పలమాల
శ్రీ కరమైన లక్ష్మివగు చిన్మయమైన సహస్ర నామముల్
శ్రీకర భాష్యమున్ రచన జేసిన ధీయుతుఁడెన్ను వేళలో
రాకను బోకయున్ సతము రాగిలు భక్తికి మెచ్చగా వడిన్
వాకున సూక్తులల్లెనట వాణియె మెచ్చగ రామకృష్ణుడే!
భావం:
శ్రీకరమైన లక్ష్మీదేవి సహస్ర నామాలకు మంగళకరమైన భాష్యాన్ని రచించిన బుద్ధిమంతుడు రామకృష్ణ రావు గారు. ఎప్పుడూ చెక్కుచెదరని భక్తికి మెచ్చి, సరస్వతీ దేవి సైతం మెచ్చుకునేలా ఆయన వాక్కులో సూక్తులు అల్లారు.
అద్భుత రత్నమాలలు మాన్యవర అన్నారు ఒక అజ్ఞాత. వారికి ధన్యవాదములు.
దత్తాత్రేయ వధానమె
ఎత్తుకు పైయెత్తుగాగ నింపుగ చేసెన్
తత్తర పాటును లేకయె
అత్తరి చేసెను విశేష మంచన శ్రోతల్!! // అన్నారు శ్రీ vబాలకృష్ణమూర్తి.. కాశీ.
సంస్కృతాంధ్ర కవిపండితులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీశ్రీశ్రీ చింతారామకృష్ణారావుగారిచేరచింపబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్ఫూర్తి గీతం యావద్రాష్ట్రభౌగోళికాంశములను సుస్పష్టపరుస్తున్నది.ఇచటి సుజలాలను,సుఫలాలను,ప్రసిద్ధపుణ్యక్షేత్రాలను, ప్రాజక్టులను పాటలో ఇమిడ్చి వర్ణించినవిధానం అద్భుతం. వీరి కలానికి శ్రీమతి వల్లూరి సత్యవతిగారి గళం తోడై లలితసంగీతఛాయలతో శ్రోతలను మంత్రముగ్థులను చేస్తున్నది.గాయని శ్రీమతి సత్యవతి గారికి అభినందనలు. శ్రీరామకృష్ణకవిగారికి నమస్సులు. భవిష్యత్తులో ఈ గీతం పాఠ్యపుస్తకాలలో ప్రచురణకు నోచుకోగలదని విశ్వసిద్దాం.
డా. సత్యయాజ్జ వల్క్య శర్మ.లింగాల
రి. గజిటెడ్ ప్థానోపాధ్యాయుడు.
పాయకరావుపేట.
అనకాపల్లి జిల్లా (ఆం. ప్ర)
9247168255
ఐతే ఇవే కాక ఇంకా చాలా చెప్పబడ్డాయండి. అందులో గణేశపురాణం కూడా ఉంది.
ఔనండి ఒకేపదాన్ని రెండుపర్యాయాలు ప్రయోగిస్తే శబ్దపునరుక్తిగా, ఒకే అర్థంలో పదాల్ని రెండ్శుపర్యాయాలు ప్రయోగిస్తే అర్థపునరుకు దోషంగా మన శాస్త్రాలు చెప్పుతున్నాయండి.
అజ్ఞాత ఇలా అన్నారు.
గురువు గారు, భరతమాత వైభవ దండకం అద్భుతం. అది శ్యామలాదండక స్వరభరితంగా చదవ మనమ్మునకానందమ్ము గల్గెన్. ధన్యుడినైతిని గురువర్యా.
వాఙ్నిర్మాణ సువేది వార్ధి గడియన్ వాతాత్మజుండెంచగా
దిఙ్నాగంబులఁ దాకి మేఘతతి సందీపించె దౌష్ట్యంబుతో
వాఙ్నిర్దేశిత కార్యసత్ఫలముకై ప్రార్థింప దిగ్దంతులన్
దిఙ్నాగంబుల హస్తఘాతములకుం దేల్పోయెఁ మేఘంబులే.
రాఘవ మూర్తీ! సుకృతుఁడ!
రాఘవు సత్కావ్య భావ రమ్యంబుగ నా
రాఘవుడొనరింపించెను.
రాఘవు దివ్యాజ్ఞ యట్లు వ్రాయుఁడు, శుభమౌన్.
ఆశీస్సులతో
చింతా రామ కృష్ణా రావు.