మంథా వీరభద్రం తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;మంథా వీరభద్రం

విజ్ఞాన శాస్త్ర విషయాన్ని విడమఱచి చెప్పే వ్యాసం కూడా సాహిత్యపు గుబాళింపులు విరజిమ్మేలా వ్రాయగలగటం మీ గొప్పదనం.

నన్నెచోడుని మాటల్లో చెప్పాలంటే, విజ్ఞానశస్త్ర వైదుష్యం,సాహిత్య వివేచన అనే కరిహరులను ఒకే గాటన కట్టగలిగిన పండితులు మీరు.

…“మరైతే ఇక్కడ ట్రిక్ ఏమిటి?” అని అడుగుతాడు. “నొప్పిని పట్టించుకోక పోవడమే ట్రిక్” అంటాడు.

ఇలాంటి తలపే గాలిబ్ ఒక కవితలో అంటాడు.

దర్ద్ కా హద్ సే గుజరనా హై, దవా హో జానా
(दर्द का हद से गुज़रना है दवा हो जाना।) “హద్దు దాటే దాకానొప్పిని భరించటం, దానికి మందు”.అని అనువదించుకోవచ్చేమో.

శకుంతలా పరిణయం కావ్యంలో కూడా పచ్చబొట్టు ప్రస్తావన వస్తుంది.

అనుయాయుడుకి బదులు అనునాయుడు అను లేఖకదోషం ఈ వ్యాసానికి దిష్టి చుక్క.

[ముద్రారాక్షసాన్ని సవరించాము. తెలిపినందుకు ధన్యవాదాలు. — సం.]


22 June 2026 11:24 PM