వేణు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
భాషాశాస్త్రం పై ఆసక్తి పెంచేలా, ఆ ఆసక్తి ఉన్నవారికి కొత్త విషయాలు తెలిసేలా, ఉపయోగపడేలా బాగా రాశారు.
Unknown: మీ వ్యాఖ్యలో కోట్ చేసిన పద్యం... రాసినవారు జాషువా. ఉమ్మడి ఏపీలో గతంలో 5/6/7 తరగతుల్లో ‘భారత వీరుడు’ అనే పాఠ్యభాగంలో చదివిన పద్యం.
‘సంగర సీమ నీకు దొలి సాయకమైన..’ అని మొదలవుతుంది.
..‘ఇనజా నను గ్రమ్మర నేయుమన్న ఛీ, యెంగిలి బాణమేయననవే రణవీరుడ వీవ యర్కజా’
అది పేపర్ కటింగ్ కదా? మీరు పీసీలో డెస్క్ టాప్ పై డౌన్ లోడ్ చేసుకుని view జూమ్ చేసుకుని చదవొచ్చు. ఈ వ్యాసం పూర్తి పాఠం రంగనాయకమ్మ గారి పుస్తకంలో ఉంది.
విశ్వప్రసాద్ గారి మూడు నవలలు.. మాయలాడి, జోకర్, జానీవాకర్ ఇప్పుడు పునర్ముద్రణ జరిగి మార్కెట్లో ఉన్నాయి. పల్లవీ పబ్లికేషన్స్ పంపిణీ చేస్తోంది.
gvskarthik10ః ఈ సినిమా తెలుగులో straight గా తీసినది. కమల్ స్వయంగా సంభాషణలు చెప్పారు. తొలి చిత్రం మరో చరిత్ర నుంచే తను తెలుగులో సంభాషణలు చెప్తూ వస్తున్నారు. డబ్బింగ్ చేసిన సినిమాలకు బాలు ఎక్కువ చెప్పారు. ఒక్క సతీ లీలావతికి మనో చెప్పారు. <br />