శర్మ దంతుర్తి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
కృష్ణ బిలాల మీద పి.బి.ఎస్ వారి అద్భుతమైన వీడియో. ఇందులో గురుత్వ తరంగాల గురించి కూడా చెప్పారు.
మీరు లింక్ ఇచ్చిన వేమూరి గారి వ్యాసం కింద కూడా నేను ఇదే ప్రశ్న అడిగాను. అది అలా ఉంచితే, రెండు పిచ్చి ప్రశ్నలు, నాకు తెలుగు రాదు కనక. [గమనిక – నాకు తెలుగు రాదు అనేది అందరికీ తెల్సిన మాట. అది వప్పుకోవడానికి ఏమీ సిగ్గు పడడం లేదు. ఇప్పటికీ హైద్రాబాదు, విజయవాడ, వగైరా నగరాల్లో మాట్లాడే తెలుగు నాకు అర్ధం కాదు. ఎవరినీ తప్పు పట్టడానిక్కాదు ఈ వ్యాఖ్య]
౧. కృష్ణ వస్తువు ఎందుకు దుష్ట సమాసం అవుతుంది? నేను అంతర్జాలం వెతికాను. కృష్ణ వస్తువు అనేది కర్మధారయ సమాసం అని వచ్చింది. తప్పు సమాసాలు – రాజమొగుడు, సింహపుగొంతు, తెల్లకాగితం (కాగితం తెలుగులోకి వచ్చిన పార్శీ, ఉర్దూ పదం ట). జోకు ఏమిటంటే, ఈ “తెల్లకాయితం” పదంతో నేను ఈమాటలోనే కధ రాసాను. 🙂 –
తత్సమ రూపంగా పరిగణిస్తే (రైట్): సంస్కృత పదం అయిన ‘వస్తు’ అనే దానికి తెలుగు విభక్తి ప్రత్యయం ‘వు’ చేరి ‘వస్తువు’ గా మారింది. ఈ లెక్కన ‘కృష్ణ’ (సంస్కృతం) + ‘వస్తువు’ (సంస్కృత తత్సమం) కలిస్తే అది శుద్ధ సంస్కృత / తత్సమ సమాసం అవుతుంది. శబ్ద మూలాలను (Etymology) బట్టి చూస్తే ‘వస్తువు’ సంస్కృత పదమే. కాబట్టి ‘కృష్ణ వస్తువు’ అనేది సరైన సమాసమే అని అంగీకరించడానికి బలమైన వ్యాకరణ ఆధారం ఉంది. (అంటే దీన్ని మీ మీద రుద్దుదాం అని కాదు, గమనించగలరు)
౨. గొయ్యి అంటే ఈ విధంగా “రోడ్డు మీద గొయ్యి, పెరట్లో మోకాలి లోతు గోతులు” అనడం వాడవచ్చు కానీ మరీ లోతైన వాటిని గొయ్యి అనడం ఎలా? రోడ్డు మీద బిలం అనలేం కదా? మా ఇంట్లో నూతులు బహు లోతైన గోతులు అనడం ఉందా? అలాగే హైద్రాబాడ్ రోడ్ల మీద బిలాలు ఉంటాయి అనడం ఉందా? గొయ్యి కీ బిలానికి చాలా తేడా ఉంది.
నల్ల వస్తువు, నల్ల బిలం కూడా వాడవచ్చు అనుకుంటా. కర్రి కాయ అంటే అదేదో మామిడి కాయ అన్నట్టు ఉందండి. వాడడం వరకూ సరే కానీ వేమూరి గారు చాలాసార్లు చెప్పారు మనకి ఇటువంటి సైన్స్ పదాలకి అసలైన తెలుగు పదాలు లేవు అని. అంతవరకూ ఎందుగ్గానీ “థేంక్స్” అనేదానికి “ధన్యవాదాలు” కాక మరో సులభమైన పదమే లేదు. నెనర్లు అనీ మరోటి అనీ అన్నా ఆ పదాలు ఏవో పక్షి ఈకలు అన్నట్టూ ఉంటాయి. హిందీలో “షుక్రియా” అనేది వాడతారు కదా అలాగ మనకి తెలుగు లో ఏదైనా ఉందా?
ఆసక్తిగా సాగుతోంది కధనం. అయితే నండూరి వారి దగ్గిర నుండి మిగతావారు అందరూ కూడా “కృష్ణ బిలం, కృష్ణ వస్తువు” అనే వాడారని గుర్తు. పుస్తకాలలో కూడా అలాగే చదివినట్టు గుర్తు. “నల్ల వస్తువు” అనడం ఎందుకో ఎబ్బెట్టుగా ఉంది (అనకూడదని కాదు).
వ్యాసం చివర్లో చెప్పిన యువకుడు ఎవరో అత్యంత సులభంగా తెలిసిపోతోంది (“పేటెంట్ పరీక్షకుడైన ఓ యువకుడు”) 🙂
సినిమా థియేటర్‌లో సెకనుకు 24 విడివిడి ఫోటో రీళ్లను
హాబిట్ సినిమా(లు), అవతార్ సినిమాలకి పీటర్ జాక్సన్, కామెరాన్-లు 24 కంటే ఎక్కువ రేట్‌తో తీసారని అంటారు.
సంపాదకులకి – ఇక్కడ టైప్ చేస్తున్నప్పుడు “జేంస్” అని వస్తోంది కామెరాన్ మొదటి పేరు. లేఖిని లో ఉన్న సదుపాయం ఇక్కడ లేనట్టుంది.
భలే ఉన్నాయండి పద్యాలు. అయితే చివర్లో ఫలశృతి అంత నప్పలేదు. “జిహ్వచాపల్యముక్తిని జెంది” ఇదే అయితే ఇంక దోశెలు తినడం ఎలా? ఒక్కో దోశె తింటూంటే జిహ్వ చాపల్యం ఎక్కువవ్వాలి. ఏమంటారు?
ఆ మధ్య ఫేస్ బుక్కులో కొంత చర్చ జరిగింది. రకరకాల పదాలు సృష్టించడం. అందులో ఒకాయన “ఫిర్ దౌసి” అంటే ఒక దోసె తిని రెండోది కావాలి అని అడిగేవాడు అన్నారు. అలాగే మనం “ఏకాదసి” అంటే చంద్రమానంలో ఉపవాసం చేసి పదకొండు దోసెలు తినేవాడు అని చెప్పుకోవచ్చంటారా? 🙂