శ్యామలీయం తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

శ్యామలీయం;శ్యామలీయం

మీకు నచ్చినందుకు ధన్యవాదాలు శర్మ గారూ.

02 July 2026 11:54 AM

శ్యామలీయం;శ్యామలీయం

చదివి సానుకూలంగా స్పందించి నందుకు మీకు నేనే అనేక ధన్యవాదాలు చెప్పుతున్నానండీ‌.

ఇతర రామకీర్తనలను కూడా పరిశీలించి మీ ఆమూల్యాభిప్రాయాలను చెప్ప ప్రార్ధన.

23 June 2026 1:01 PM

ఆహ్లాదం;శ్యామలీయం

చాలా. సరిగా వ్రాసారు అహల్యావృత్తాంతాన్ని. అభినందనలు.

23 June 2026 9:04 AM

శ్యామలీయం;శ్యామలీయం

ఈటైపో పుణ్యమా అని మౌనపాఠకవరేణ్యులు ఒకముక్క అన్నారు. సంతోషమండీ.

16 June 2026 3:48 PM

Jwala's Musings;శ్యామలీయం

మీరు " కానీ ఇలాంటి స్నేహాలు మాత్రం కాలాన్ని జయిస్తాయి." అన్నారు. అక్షరసత్యం. నాస్నేహాలు కొన్ని నాబాల్యంలోనే మొదలై కొనసాగుతున్నాయి. నేను ఉద్యోగం చేసిన చోటల్లా మంచిస్నేహాలు ఏర్పడ్డాయి. స్కూలురోజుల వారు, ఇసీఐల్ వారు, ఓరకిల్ వారు, ఐబీయం వారు, జీటాగైల్ వారు, ఇన్నోమైండ్స్ వారు.. ఇలా ఎందరెందరో. అంతా పలుకరించుకుంటూనే ఉంటాం. వీరిలో విదేశీయులూ ఉన్నారు. ఈ 18న మాయింటికి కొందరు ఇసీఐయల్ మిత్రులు వస్తున్నారు - మాది యాభైయేళ్ళ స్నేహం. వీరిలో ఒకతను మల్లికార్జున రావు సృష్టిలో తీయనిది స్నేహమే అని ఆరోజుల్లో ఎక్కడో వ్రాసి బహుమతి పొందాడు.

16 June 2026 8:46 AM

Jwala's Musings;శ్యామలీయం

"ఉద్యోగరీత్యా 1974 ప్రాంతంలో నేను హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మేము చిక్కడపల్లి, అశోక్ నగర్, గాంధీనగర్ ప్రాంతాలలో ఉండేవాళ్లం" అన్నారు మీరు.

నేనూ 1974 లోనే ఉద్యోగరీత్యానే హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డాను. వచ్చిన కొత్తలో నేను రామ్ నగర్ గుండు వద్ద ఉండేవాడిని. దరిమిలా సీతాఫల్ మండీకి మారాను.

16 June 2026 8:45 AM

A.M. Khan Yazdani & Usha S Danny;శ్యామలీయం

వామపక్షం మరియు ప్రజాతంత్రం అనేవి కలిసి ఉండే భావజాలాలు కానేకావే! వామపక్ష ప్రజాతంత్ర ఏమిటి అసందర్బం. ఇది పచ్చిమోసకారీ మాటే. ఏకమ్యూనిష్టు ప్రభుత్వమైనా ఏదేశంలోనైనా ప్రజాస్వామ్యం పాటించిందా?

15 June 2026 3:03 PM

The Rich Monk World;శ్యామలీయం

ఎంటర్‌టైన్మెంట్ ఒక్కటే పాయింట్. ఈమాట నిజమే. కాని దాని రూపస్వభావాలు కాలానుగుణంగా మారతాయి. నాటకాలు పోయి సినిమా. రేపు సినీమా పోయి మరొకటి రావచ్చును. సినిమాను చిరంజీవి అనుకోవటం పొరపాటు కావచ్చును. ఏఐ కారణంగా సినీమా కొద్దోగొప్పో మారవచ్చును. ఏఐ పోయి మరొకటి వస్తే అది సినీమాపై మరింత ప్రభావం చూపవచ్చును. సినీమాను జనం రిసీవ్ చేసుకొనే విధానం మారుతోంది కాబట్టి సినీమా టేకింగ్ కూడా కాలానుగుణంగా మారకతప్పదు.

ఇకపోతే ఎక్కువ పెట్టుబడి లేదా ఎక్కువ స్క్రీన్స్ మీద రిలీజ్ ఐనంత మాత్రాన పెద్దసినిమా కాలేదు. జనాదరణే కొలబద్ద. కలెక్షన్ డివైడెడ్ బై ఇన్వెష్ట్మెంట్ విలువే నిజమైన సక్సైస్ ఇండెక్స్.

26 May 2026 10:25 PM

శ్యామలీయం;శ్యామలీయం

ధన్యవాదాలు మీకు నచ్చినందుకు.

24 May 2026 12:19 AM

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య;శ్యామలీయం

ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మా అన్న పాట సీనియర్ నందమూరి తారకరామారావు హీరోగా వచ్చిన "జగదేకవీరుని కథ" సినిమా లోనిది. పింగళి నాగేంద్రరావు గారి పాటకు పెండ్యాల నాగేశ్వరరావు గారు బాణీ సమకూర్చగా సుశీల, లీల ఆలపించారు. ఈపాటలో నృత్యం చేస్తూ పాడిన నటీమణులు బి.సరోజాదేవి, జయంతి, బాల, ఎల్. విజయలక్మ్మి.

17 April 2026 9:48 PM

శ్యామలీయం;శ్యామలీయం

గమనిక: కొద్దిరోజుల తరువాత శ్యామలీయం బ్లాగు పూర్తిగా కనుమరుగు కావచ్చును. నా వెబ్ సైటును శోధినిలో జతపరుస్తానని హామీ యివ్వలేను. కాబట్టి ఆసక్తి కలవారు https://syamalarao.in/ అనే నా కొత్త సైట్ చిరునామాను నోట్ చేసుకోగలరు.

16 April 2026 7:38 PM

శ్యామలీయం;శ్యామలీయం

కీర్తన చిన్నదంటే చిన్నదే అనుకోవచ్చును పల్లవి + రెండు చరణాలు మాత్రమే నిడివి కాబట్టి. ఖండగతిలో నడుస్తుంది కాబట్టి సులువుగానే శ్రుతిసుభగంగా పాడుకోవచ్చును. మీరన్నట్లు పూజావసానసమయంలో గీతం శ్రావయామి అనవచ్చును దీనితో.

06 April 2026 9:04 AM

శ్యామలీయం;శ్యామలీయం

నేను ఈమధ్య చాలా నెలలపాటు తెలుగుబ్లాగులను వదలిపెట్టి నిజంగా చాలా చాలా హాయిగా ఉన్నాను. ఎక్కువమంది అడుగుతున్నారని నా బ్లాగును మళ్ళా పబ్లిక్ చేసి బ్లాగ్లోకం లోనికి వచ్చాను. అది చాలా పెద్దపొరపాటే అని గ్రహించాను. ఇక్కడ ఈ రాజారావు, జిలేబి అనే ఇద్దరు వ్యాఖ్యావీరులు నిత్యం అదేపనిగా నిరంతరాయంగా నామీద రాళ్ళువేస్తుంటే మిగిలిన అందరు తమతమ ఒళ్ళు కాపాడుకోవాలని దూరంగా కూర్చుని వినోదం చూస్తున్నారు మౌనంగా. ఆ

26 March 2026 11:23 AM

శ్యామలీయం;శ్యామలీయం

23 మార్చి, 2026 10:28 PM సమయంలో వ్యాఖ్య చేసిన అనామకు లెవరో తెలిసిపోతూనే ఉంది. అనవసరంగా బోలెడు వివరణ వ్రాసాను.

24 March 2026 1:51 PM

శ్యామలీయం;శ్యామలీయం

ఈపద్యం రెండవపంక్తిలో దోషం ఏమీలేదు.

పద్యమ్ము
రసము చిప్పిల్ల వ్రాయవలయు
రసవిహీన మైన గులక రాళ్ళ ప్రోగు

అని అన్వయం బహుసుభగం గానే ఉంది.

రాజారావు గారి పద్యాలలోని గుణదోషాలను గురించి చెప్పిన మాటలు చదివి కూడా ఇలా వ్రాసారంటే ఏమనుకోవాలి?

ఆయనకు తెలుగులో ప్రాథమికమైన పలుకుబడియైన సంధుల అవగాహనయే లేదు. ఉత్వసంధి యేదో వ్యాకరణరహస్యం ఆనుకుంటారు!

24 March 2026 12:43 AM

శ్యామలీయం;శ్యామలీయం

ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

24 March 2026 12:32 AM

సుజన - సృజన;శ్యామలీయం

అర్ధమైన దండీ.

సర్వజ్ఞుల మని భావించుకొనే మీకు పొగడ్తలు తప్ప మరేమీ రుచించవని గ్రహించాను.

ఇక పొరపాటున కూడ తమరిని ఉద్దేశించి మాటలాడను. నిరుపయోగమైన పని చేయటం నాకూ అవసరం కాదు.

మీరూ మీ మిత్రులూ నిత్యం పరస్పరం కీర్తించుకుంటూ హాయిగా ఉండండి.

23 March 2026 7:29 PM

దార్ల;శ్యామలీయం

అదృష్టవంతులు మీరు. అభినందనలు. గురువుకు శిష్యులు బిడ్డలే. సందేహం లేదు. మీఆనందం అర్ధం చేసుకోగలం. పద్యాలు బాగున్నాయి.

23 March 2026 5:15 PM

సుజన - సృజన;శ్యామలీయం

ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

23 March 2026 2:26 PM

శ్యామలీయం;శ్యామలీయం

నాపని నేను చేసుకుంటూ వెళ్ళటమే నాకర్తవ్య మండీ.

నది ప్రవహిస్తూ వెళ్ళే క్రమంలో మైదానాలూ లోయలూ వనాలూ ముళ్ళపొదలూ మరుభూములూ పర్వతాలూ వంటివి ఎన్నెన్నో ఎదురౌతూనే ఉంటాయి. ప్రయాణం ఐతే ఆగదు కదా. కొన్ని సార్లు అడ్డంకులు తొలగిపోతాయి మరి కొన్ని సార్లు నదియే తప్పుకొని ముందుకు సాగుతుంది.

సహజమైన దానికి విచారం లేదు. వేదన అవసరం లేదండి.

21 March 2026 9:22 PM