సరసి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;సరసి

ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ప్రతి వాళ్ళ నమ్మకాలని మన నమ్మకపోయినా వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాలి. ఇటీవల విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సంప్రదాయాల్ని పాత పద్ధతుల్ని ప్రశ్నించడం, వ్యతిరేకించడం ఎక్కువైపోయింది. అది గొప్ప అనుకుంటున్నారు. ఏ దేవుడు చెప్పినా ఏ మతం చెప్పినా శాంతి, సహనం ప్రధానమైనవి. ఈ సూక్ష్మం గ్రహిస్తే చాలు. పరమత సహనం లేకపోతే పరాయి వ్యక్తుల్ని కూడా గౌరవించలేము. అది లేని నాడు సమాజం భ్రష్టపట్దిపోతుంది. కథ అంశం చాలా బాగుంది సమాజానికి ఉపయోగించేది. మాట్లాడుతున్నట్టుగానే కథనం ఉంది ఆసక్తికరంగా సాగింది. రోహిణి గారికి అభినందనలు.


17 July 2026 5:56 PM