B. Devi Prasad తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for కొలిమి;B. Devi Prasad

జ్యోతి గారు, ఇది కథ లా కాకుండా ఒక కేస్ స్టడీ లా వచ్చింది. స్త్రీ జీవితాలలో ప్రేమ రాహిత్యం బాధించినంత గా పురుషుల జీవితాలలో జరగదు. స్త్రీల వ్యక్తిత్వం ప్రధానం గా ఎమోషనల్ వ్యక్తిత్వం కావడం వల్లనేమో. గత తరంలో స్త్రీలలో పరాధీన స్థితి వున్నా, మగాళ్లలో పురుషాహంకారం ఉన్నా – ఎక్కడో ఒక దగ్గిర ఉత్తమ పురుషులు, ఉత్తమ స్త్రీలు కనపడిన రుజువులున్నాయి. ఈ తరంలో – అంటే ప్రస్తుతం 30, 20 లలో వున్న వారి జీవితాలలో ఒక ఆదర్శం, ధ్యానం, దిశా లేవు. ఎక్కువ జనం, ఏ లింగమైనా, వొట్టి పొల్లు ధాన్యమే. మీ వర్ణన ఈ స్థితిని కేప్చర్ చేసింది. ఈ ఎలియనేషన్ ఎంతో బాధ. కానీ తప్పించుకోలేని, చెప్పుకోలేని, చాలా మందికి అవగతం కానీ బాధ.


03 July 2026 11:20 PM