CHANDRASEKHAR CHEERLA తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;CHANDRASEKHAR CHEERLA

Space and time – దేశము, కాలము వేరువేరు కావు. దేశము లేనిదే కాలము‌లేదు, కాలము లేనిదే దేశము లేదు. ఈ‌ విషయం సహజసిద్ధంగా‌ అంటే ఆక్లిష్టంగా Jonathon Livingston Seagull (Richard Bach) అన్న చిన్న కథ చివరన నిరూపింపబడింది. ఒక seagull – సముద్రపు నీటి పక్షి, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎంత త్వరగా చేరగలను, అని అంచెలంచెలుగా తదేక దీక్షతో తన వేగం పెంచుతుంటుంది. చరమాంకంలో అసాధ్యమైన వేగంతో పయనించినపుడు తాను అనుకొన్నదే తడవుగా తాను చేరవలసిన ప్రదేశంలోనే ఉన్నానని గుర్తిస్తుంది – అంటే ఒక బిందువుకు, మరొక బిందువుకు మధ్యన ఉన్న దూరం శూన్యం – ఉన్నది సర్వవ్యాప్తమమైన ఒకే బిందువు. ఆ ఎరుక ఉన్నపుడు పయనించే ప్రసక్తే ఉండదు కదా.

దేశకాలములను విడిగా విశ్లేషించాలన్న తపనతో కొందరు పాశ్చాత్య తత్త్వవేత్తలు ఒక భ్రమలో పడిపోయినారు. ఇప్పుడు quantum physics ఈ సత్యానికి దగ్గరలో ఉన్నది.

అకాలాద్వవచ్ఛిన్నము – కాలాద్యనవచ్ఛిన్నము. కాలాది అనడంలో దేశకాలములన్న అర్థం ఉంది. దేశకాలాద్యనవచ్ఛిన్నా – అన్నది, ఆదిమునులు, ద్రష్టలైనవారు దర్శించినది, అద్వైత మూలము.

పైన రాధాకృష్ణ మూర్తిగారు గారు వర్ణించిన ‘అవస్తువు’ కూడా ఈ అనాద్యంతమైన అస్తిత్వమే – మరొక వస్తువు లేదు కనుక అవస్తువైనదని నా భావన.


02 July 2026 6:52 PM