అహం పూర్వమేవ జానామి!” అనే సంస్కృత వాక్యానికి అర్థం “నాకు ముందే తెలుసు!
ఈ కథ ఆధునిక సమాజంలో కుల, వర్గ బేధాలు, డబ్బు అహంకారం మనుషుల ప్రాణాలను ఎలా బలి తీసుకుంటున్నాయో కళ్ళకు కట్టినట్లు చూపే ఒక హృదయ విదారక దృశ్యం. సంపన్న కుటుంబానికి చెందిన హసంతి, పేదరికం మధ్య బతుకుతున్న ప్రణీత్ పాత్రల మధ్య వైరుధ్యం రచయిత్రి చాలా సహజంగా మలిచారు. ప్రేమ, ఆప్యాయత, తల్లిదండ్రుల బెంగ, చివరకు కులగర్వంతో జరిగే దారుణం పాఠకులను తీవ్రంగా కలచివేస్తాయి. చివరిలో హసంతి ఫోన్ చేసి చెప్పే తీరు కథ పేరుకు ముడిపెట్టడం చాలా బాగుంది. మానస గారికి అభినందనలు.