Kottapali తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
విలువైన సమీక్ష. ఆసక్తిగా నవల మొదలు పెట్టాను కానీ యాభై పేజీలకు దాటి చదవలేక పోయాను. పైగా క్రైస్తవ మత ప్రచారానికి రాసినట్టుగా అనిపించింది నాకైతే. తరువాత భాగాల్లో మత వైరుధ్యాల పట్ల సమతుల్యత ఉంది కథనంలో మీరు చెబితే ... పోనీలే కనీసం .. అనుకుంటున్నా.
@Seetha Mahalakshmi ఇక్కడ snow mobile బాగా మంచు పడే ప్రదేశాల్లో ఊంటాయి. చూడ్డానికి మన స్కూటర్ లాగా ఉంటాయి. నేల మీద బాగా దట్టంగా నేల మీద మంచు పేరుకుని ఉన్నప్పుడు వేగంగా మంచు మీద ప్రయాణించడానికి ఉపయోగ పడతాయి.
అబ్బా ఏమి కథండీ. చివారికొచ్చే సరికి కళ్ళ నీళ్లు తిరిగాయి. ఈ చలమయ్య శాస్త్రి గారు, సీతారామ శాస్త్రిగారు సోదరుల గురించి మరో గగుర్పొడిచే కథ శ్రీపాద వారి అనుభవాలూ జ్ఞాపకలూనూ లో ఉంది. 🙏🏾🙏🏾
అబ్బా ఏమి కథండీ. చివారికొచ్చే సరికి కళ్ళ నీళ్లు తిరిగాయి. ఈ చలమయ్య శాస్త్రి గారు, సీతారామ శాస్త్రిగారు సోదరుల గురించి మరో గగుర్పొడిచే కథ శ్రీపాద వారి అనుభవాలూ జ్ఞాపకలూనూ లో ఉంది. 🙏🏾🙏🏾
బాగుంది.
మీ ప్రశ్నలన్నిటికీ సూటిగా సమాధానం చెప్పడం కష్టం.
మొదటి విషయం - పంచరత్న కృతులు ఆ వరుసలో రచించారని రూఢి యేమీ లేదు. ఘనరాగ పంచకం అని ఆ ఐదు రాగాలనూ ఆ వరుసలో పేర్కొనడం ఒక ఆనవాయితీగా వస్తున్నది బహుశా త్యాగరాజు ముందటి నించీ. అంచేత పంచరత్న కృతులని కూడా అదే వరుసలో పాడుతున్నారని అనుకోవచ్చు.
సాధించెనే అనే పల్లవి ఉండగా సమయానికి తగు మాటలాడెనే అనే ముక్కని ఎందుకు తెచ్చారు అంటే కూడా చెప్పడం కష్టం. పంచరత్న కృతుల్లో ప్రతి చరణానికీ ముందు చిట్టస్వరం వస్తుంది. కానీ సమయానికి తగు మాటలాడెనే అనే ముకకి చిట్టస్వరం లేదు. దాన్ని పల్లవిలాగానే పాడుతూ ఉంటారు. ఈ ముక్క కాకుండా సాధించెనే అనే పల్లవినే చరణానికీ చరణానికీ మధ్య పాడిన ఉదంతాలు (ఎమ్మెస్ పాడింది ఒక రికార్డులో).
అర్ధం అన్వయం సాధించెనే అన్నా కూడా సరిపోతుంది.
కృతి ముత్తమ్మీద స్థూలంగా ఉన్న ధ్వని మీరు బాగానే గ్రహించారు. రాముడిగా అయినా, కృష్ణుడిగా అయినా ఆయన రక్షితానని చెప్పాడు. నన్ను రక్షించడం లేదు, అంచేత అది బొంకయింది - ఇదే అందులో పరమార్ధం.
బాగుంది. దర్శనం చేసుకున్నాము గానీ రాత్రి పూట వెళ్ళడంతో ఆలయ విశేషాలు చూడలేకపోయాము.