SRIRAM తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
రాత్రి యొక్క అంతుచిక్కని స్వభావాన్ని పట్టుకోగల రచయితలు అరుదు. దోస్తోవిస్కీ, గురుదత్ లాంటి చాలా తక్కువమంది రాత్రి యొక్క ఆత్మను పట్టుకోగలిగారు. తెలుగులో రాత్రి యొక్క అంతుచిక్కనితనాన్ని పట్టుకోగలిగిన సామర్థ్యంగల కొద్దిమందిలో, లేదా ఓకే ఒక రచయిత్రి మణి గారు.
కథ ఒక అనుభవం. అయితే కథను ఒక నైరూప్య అనుభవంగా మలచడం అందరికీ సాధ్యం కాదు. ఒక లీనియర్ కథనానికి అలవాటు పడిన పాఠకులకు అనుభవమే కథ అని చెబితే సందేహిస్తారు. ఈ కథ కథల యొక్క చట్రాన్ని పగుల కొట్టి బయటకు వచ్చింది. ఒక గొప్ప అనుభవాన్ని సృష్టించడానికి కొత్త తరహా వ్యక్తీకరణ అవసరం. నియామాల ఉల్లంఘన అవసరం. అవి ఈ కథలో పుష్కలంగా ఉన్నాయి.
అలానే అందరూ నైరూప్య అనుభవాన్ని తీసుకునే పరిణతతో ఉండరు. అయినా పాఠకుల కోసం రచయిత కథలో గాఢతను తగ్గించాల్సిన అవసరం లేదు. పాఠకులే కథ యొక్క స్థాయిని శ్రద్ధ పెట్టి అందుకోవాలి. అటువంటి సవాలును విసిరే కథలు విమర్శలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొత్తదారిలో వెళ్ళే వారికి ముళ్ళు గుచ్చుకోవడం సహజం. భరిస్తూ ముందుకుపోవాలి.
i really dunno if i am heralding any change...i thouught that was the need of the hour. anyway, thanks for acknowledging.