Sivalakshmi తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
అనేక వివరణలతో పాఠకులు గొప్ప ప్రజాస్వామ్య భావనలను పెంపొందించుకోవడానికి దోహదం చేసేదిగా “గాలివాటం, గందరగోళం, నిర్బంధకాలం” అనే అశోక్ గారి సామాజిక వ్యాస రచన ఈ సంక్షోభకాలంలో చాలా ఆలోచింపజేసేదిగా ఉంది. మరీ ముఖ్యంగా చివరి పేరాలో,”ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమే కాదు. విమర్శించే హక్కు, వ్యతిరేకించే హక్కు, వెటకారం చేసే హక్కు, అసమ్మతి వ్యక్తం చేసే హక్కు … ఇవన్నీ కలిసే ప్రజాస్వామ్యం. అధికారాన్ని ప్రశ్నించినందుకు ఎవరైనా భయపడాల్సి వస్తే, ప్రజాస్వామ్యానికి ప్రమాదం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఎందుకంటే ప్రతి నిర్బంధం వెనుక ఒక వ్యక్తి మాత్రమే బాధపడడు. ఒక సమాజం తన స్వేచ్ఛలో కొంత భాగాన్ని కోల్పోతుంది. కాబట్టి ప్రశ్నను సజీవంగా నిలబెట్టుకుందాం. మన స్వేచ్ఛను మనమే కాపాడుకుందాం.” అని చెప్పారు. ఇది పౌరుల ప్రశ్నించే బాధ్యతను మర్చిపోవద్దని మనల్ని హెచ్చరిస్తుంది!