Sreenivas Paruchuri తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
వేంకటరమణగారు, మీ వ్యాసం 2012 లో ఈమాటలో వచ్చినప్పుడు చూచినట్లు లేను. My loss! మీరు ప్రస్తావించిన చాలా పద్యాలు ఒకప్పుడు కంఠతా నేర్చుకున్నవి.
ఈ రోజు వేరొకచోట “గంగా సంగమమిచ్చగించునె? మదిన్ గావేరిఁ దేవేరిగా …” అన్న పద్యం ప్రస్తావన వస్తే “తెనాలి రామకృష్ణ” సినిమాలో తీసివేయబడిన కొన్ని పాటలు, పద్యాలలో ఇదొకటి అని కామెంటు రాస్తూ “ఉదయం బస్త నగంబు సేతువు హిమవ్యూహంబునం జుట్టి రా …” గురించి కూడా ప్రస్తావించాను. పద్యం మొదటి పాదమే గుర్తుంది, Google లో వెతికితే మీ వ్యాసం కనబడింది. అలా ఇప్పుడు చదవగలిగాను.
ఈ పద్యం, సినిమా చివరిలో తెరపై “శుభం” పడేప్పుడు మాధవపెద్ది గొంతుకలో వస్తుంది. వచ్చేది అనాలేమో! ఇప్పుడు మట్టి రికార్డుపైన మాత్రమే మిగిలింది. ) నిజానికి ఈ పద్యం గురించి సుమారు 30 ఏళ్ళ క్రితం “తెలుసా” అన్న e-mail discussion group లో ఒకసారి రాసాను. సినిమాల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, సినిమాలో వచ్చే tenaali కవి గారి మరొక పద్యం “తరుణ శశాంక శేఖర మరాళమునకు సారగంభీర కాసార మగుచు…” (ఉద్భటారాధ్య carఇత్రంలోనిది).