Sodhini

Vijay Jeedigunta: తెలుగు బ్లాగర్ వ్యాఖ్యలు

ఈ పుస్తకాల పండుగ లో పాల్గొనే అవకాశమివ్వడమే కాకుండా, నన్నెంతో ఆదరించి సత్కరించినందుకు మీకు, శ్రీపాద పబ్లికేషన్స్ వారికి కృతజ్ఞతలు భద్రుడు గారు.

ఫణిగిరి ప్రత్యక్ష సందర్శన లో కూడా పసిగట్టలేని విషయాలెన్నో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు చెప్పారు భద్రుడు గారు. ఇప్పుడు కదా మన యాత్రకు పరిపూర్ణత చేకూరింది.

ముందు ముందు మీరు సూచించినట్టు.. తెలంగాణాలో కృష్ణా-గోదావరీ పరీవాహక ప్రాంతాల్లోని బౌద్ధ క్షేత్రాలు- కోటిలింగాల, ధూళికట్ట, కొండాపూరు, ఫణిగిరి, వర్ధమానుకోట, జగ్గయ్యపేట మీదుగా అమరావతిదాకా, అలానే ఆంధ్ర ప్రాంతంలో కూడా శాలిహుండం నుంచి బొజ్జన్నకొండ, ఆదుర్రు, జీలకర్రగూడెం, అమరావతి దాకా ఒక యాత్ర కలిసి చేద్దాం సార్.

భద్రుడు గారు, నేను కూడా ఈ యాత్ర మీతో పాటే చేసినప్పటికీ, ఆ శిల్పాలన్నీ చూసినప్పటికీ మీ కాళ్ళలో, కళ్ళలో ఏదో మంత్ర శక్తో, మరో మహిమో ఉందనుకుంటాను. మీ రెండు పోస్టులు చదివాకా ఆ శిల్పాల ప్రాముఖ్యత, చరిత్ర, నేపథ్యం మరింత అవగతమయ్యింది. మరిన్ని యాత్రలు మీతో చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాను. ముఖ్యం గా మీకు చెప్పినట్టుగా చైనా యాత్ర మీతో చేసి తీరాలి.