dyssdkjrajendraprasad తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఈ బహుమతి కథలు, ఇతరపోటీలలో (రెగ్యులర్ పత్రికలు కాకుండా) కూడా బహుమతి పొందిన కథలు చదవాలని, నేర్చుకోవాలని ఉంటుంది. ఆయా కథలు రచయిత(త్రు) ల, పోటీ నిర్వాహకుల సౌజన్యంతో మన వసుంధర.కం ద్వారా చదివే వీలు కలిగితే నాలాంటి సాహిత్య పిపాసులు చాలా సంతోషిస్తారు.
ఈ వ్యాసం వ్రాసిన శ్రీ పొత్తూరి రాజేంద్రప్రసాద్ వర్మ గారి పేరు, నా పేరు దగ్గర దగ్గరగా ఉండటం వల్ల కొంతమంది నన్ను ఆయనగా పొరబడుతున్నారు. నాకు ఆయనకున్నంత ప్రతిభ, అనుభవం రెండూ లేవు.
. ఇక ఈ వ్యాసం లోని విషయానికి వస్తే అద్భుతంగా కథలు చదివే కొంతమంది, రకరకాల కథలు చదువుతూ ఉన్నారు. వీటిలో సాహితీ విలువలు ఉన్నవి, లేనివి కూడా ఉన్నాయి. ఎంపిక చేసుకోవడం శ్రోతలకు కొంతకష్టమైన పనే అవుతున్నది. కొంతమంది ఆడియో ఎఫెక్ట్ లు కూడా చేర్చి చదువుతున్నారు. ఇదీ సంతోషకరమే కానీ ఒక్కోసారి అసలు కథను ఇవి ఓవర్ టేక్ చేస్తూ ఉన్నాయి. ఇది గ్రహించి వారు సరిదిద్దుకోగలరని ఆశిస్తున్నాను.
బహుమతి పొందిన వారి పేర్లలో నాకు కొత్త పేర్లు ఏవీ కనిపించలేదు. అంటే కొత్త/ వర్ధమాన రచయితలు ఎవరికీ హాస్య స్ఫూర్తి లేదనుకోవాలా లేక నిబంధనలకు అనుగుణంగా వ్రాయడం రాదనుకోవాలా? కథను కుదించడం, పెంచడం అనేబ్రెండు విషయాలకు తెలుగు భాషను మించిన భాషలేదు. ఒకే ఒక అక్షరం లో చెప్పే విషయాన్ని సుమారు ఇరవై పదాలలో చెప్పవచ్చు. పెద్ద వాక్యాలను చిన్న పదాలకు తగ్గించవచ్చు. కొత్త/వర్ధమాన రచయితలకు ఇవేవీ తెలియడం లేదని అనిపిస్తున్నది.
అతి చిన్న రచయితనైన నేను వ్రాసిన కథ ‘సహగమనమ్’ ను ఏ అరమరికలూ లేకుండా మెచ్చుకున్నా మంచి మనిషి వారు. వారు కాలధర్మం చెందినందుకు నాకు చాలా బాధగా ఉన్నది.
తెలుగు అకాడమీ లో అకాడమీ ను తెలుగులోకి మార్చమని అడగండి చాలు.