krishnamacharyulu Chilakamarri తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for విహంగ;krishnamacharyulu Chilakamarri

సరళమైన కవితలో గంభీరమైన సందేశం వుంది. నేటి మహిళకు మార్గ దర్శి ఈ కవిత.


05 June 2026 5:29 PM

Comments for విహంగ;krishnamacharyulu Chilakamarri

సంసారం ఒక మాయ. కుటుంబ సారథి, మాతృదేవత, త్యాగశీలి వంటి బిరుదులతో స్త్రీని గౌరవించినట్టే కనిపించినా, ఆమెను ఇంటికే పరిమితం చేసి ఒక విధంగా కట్టుబానిసగా మార్చిందీ సమాజం.

ఆ మాయాజాలం నుంచి బయటపడలేక దిగులుతో కుమిలిపోయిన రజిత, చివరికి తన స్వేచ్ఛను ఎలా పొందిందో రచయిత్రి హృద్యంగా చిత్రించారు. సామరస్యపూర్వకమైన దృక్పథంతో, పరస్పర అవగాహనతో ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా పరిష్కరించవచ్చనే సందేశాన్ని ఈ కథ ద్వారా అందించారు.


05 June 2026 5:27 PM