sarma తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఏమి చెప్పుదును జిలేబి
తలుచుకున్నందుకు ధన్యవాదాలు.

బతుకు భారంగా ఉంది,వానలేక. నిన్నటిదాకా అక్షతల్లా పడ్డచినుకు నేడు లెక్కపెట్టగల వరసకు చేరింది.పట్టణాలు ములుగుతున్నాయి,ముంబై మొదలు,రాజమండ్రి దాకా. చిత్రంగా పల్లెలలో చినుకు లేదు.పంటమాట పరమాత్మకే తెలుసు. వారంగా మబ్బుంది,వేడి తగ్గలేదు.ఎల్ నినో మా ముఖాల వేలాడుతోంది.

ఇక,ఎలపట,దాపటలకు సమన్వయం తగ్గింది,కత్తెర పడక తప్పదన్నారు,
హరేరామ హరేరామ
రామరామ హరేహరే
హరేకృష్ణ హరేకృష్ణ
కృష్ణకృష్ణ హరేహరే
శ్రీనివాస్ జీ,
జీవన్ ప్రమాణ్ వచ్చింది మొదలు ఆఫీసులచుట్టు తిరగడం పోయింది. జీవన్ ప్రమాణ్ కి ఇవ్వడానికి అందరికి ఆ వివరాలు తెలియవు. ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ తో కూడా లైఫ్ సర్టిఫికట్ ఇవ్వచ్చు. ఇంత టెక్నాలజీ ని ఉపయోగించుకోగలిగిన వారు వయసు మళ్ళినవారిలో తక్కువ. ఎక్కువమంది స్త్రీలు వీరు ఫేమిలీ పెన్షనర్లు,పల్లెలలో, మారుమూల ప్రదేశాల్లో ఉంటారు. వీర్ని చేరడం కష్టం. ప్రభుత్వం ఈ లైఫ్ సర్టిఫికట్ కూడా అందరిని
బోనగిరి సార్!
మీరు చెప్పినమాట సైన్స్ చెబుతున్నది,కాదనలేను. కాని అనుభవం మీద మన పెద్దలు చెప్పినది,ఇది మన సమాజంలో ఉన్నది. మరికొన్ని చోట్ల కూడా ఈ విషయం ఈ మధ్యకాలంలో చదివాను.
చెప్పలేదని గోల పెడతావు,రాసే ఓపికలేదు, లింక్ లో చదువుకో.
https://www.google.com/search?q=%E0%B0%85%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%AE+%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81+%E0%B0%A8%E0%B1%88%E0%B0%A5%E0%B0%A8+%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0&rlz=1C1JJTC_enIN1214&sourceid=chrome&ie=UTF-8

శ్రీనివాస్ జీ

ఈ ప్రశ్న చాలా కాలంగానే బ్లాగుల్లో ఉన్నదండి.
జిలేబిగా తెనుగుబ్లాగుల్లో ఉన్న ఈ జీవి,ఊరు,పేరు,మగ,ఆడ చెప్పుకోలేని జీవి. నేనైతే తృతీయ ప్రకృతిలో చేర్చుకున్నాను.

అల్లుడనే సందర్భం గురించి.
కృతిని కాలంగా కన్యగానే చెప్పుకొచ్చారు. కృతిని అంకితం తీసుకున్నవారు ఆడ,మగ ఎవరైనా కృతిభర్తగానే చెప్పారు.మగవారైతే కృతికర్తకు అల్లుని వరుసకు చేర్చేసేరు. ఈ ఒక్క విషయంలో
శ్రీనివాస్ జీ

చాలా కాలం కితం మాట.చరిత్ర టూకీగా
శ్యామలీయంగారు రెండు "జిలేబి శతాకల"కి కృతికర్త. జిలేబి కృతిభర్త. అలా జిలేబి శ్యామలీయంగారి అల్లుడు.

ఇక నాకు జిలేబికి ఎప్పుడూ అష్టమ చంద్రుడు నైథన తార కదండీ.

ఇక నేరేళ్ళు ఎక్కువకాస్తే కరువొస్తుందని ఒక వ్యవసాయదారుడు నా వయసువాడు చెప్పినమాట. ఇక్కడ సమయం సందర్భం కలిసొచ్చాయి గనక చెప్పేనండి. నేరేళ్ళు ఎక్కువకాసేయి
జిలేబి

నీది ఏదుంతిన్నా ఎడబెట్టీనట్టు పందుంతిన్నా పరగడుపే లెక్క.అంతా కొత్తే నీకు. ఈ టపా చదువుకో కామెంట్లతో సహా!
https://kasthephali.blogspot.com/2026/02/blog-post_26.html

చెత్త బ్లాగులు చెత్త పోష్టులు చెత్త వ్యాఖ్యలు గుంపులే
ఎత్తి పోతలు వింత భాషల చెత్త కైతలు పోగులే
మొత్తుకోళ్ళులు నెత్తిపొడ్పులు సుత్తిమాటలు రాశులే
వత్తురా యిక పాఠకుల్ మన బ్లాగులోకపు
మౌనపాఠకవరేణ్యులు, మంచి బిరుదిచ్చారు కదుసార్!
ధన్యవాదాలు.

రమ్యముగా రామనామము జపించు పుణ్యాత్ములున్న పట్టణాల చినుకు నర్తనమాడె
మాలాటి రామనామ మహిమ కనరాని మొరకులున్న పల్లె చుక్క చిందలేదు
నలభై పైమాట వేడి, చుర్రునకాలే ఎండ నిత్యం. వడగాలి అనునిత్యం బోనసు.
రాత్రి పన్నెండుకు కూడా చల్లబడదాయె ఇదే ఖర్మమో రామచంద్రా!

అన్నీ బూతులే ఉంటాయి, మన్నించెయ్యాలి. వేడికి మతి తప్పి,
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని పక్షి
చెందనే మోక్షమును సూటిగాను
Feel typo in secon line.
వేడి 40 పైనే ఉంటోంది. వుదయం పదికే వడగాలి వీస్తోంది. రాత్రి 12 కు కూడా చల్లబడటం లేదు.

టపా కాపీరైట్ ఉల్లంఘన అవుతుందనుకోలేదు. టపా తీసేస్తున్నాను.
ధన్యవాదాలు

శ్రీ మాత్రేనమః🙏
అమ్మను ఎలా తలుచుకున్నా ఆనందమే.
నిత్య పారాయణకు అనువుగా ఉన్నట్టున్నాయి🙏
నట భీభత్సలను చూశాం కాని కవి భీభత్సలను చూడలేదు. సాహో! ఆస్ట్రేలియా
మిత్రమా!
కుశలం తెలిపినందుకు సంతసం.
పెద్ద పెద్ద ఆగ్రిగేటర్ లన్నీ కాలంలో కనుమరుగైపోయాయి. మాలిక నెమ్మది నెమ్మదిగా కనపడకపోయింది. మాలిక మరి కనపడుతుందనే ఆశ సన్నగిల్లింది.
కాని బాగుల్ని మనల్ని కనిపెట్టుకుని ఉన్నది శోధిని మాత్రమే! తెనుగు బ్లాగులకి మిగిలిన ఏకైక ఆగ్రిగేటర్, బ్లాగుల్ని మొదటినుంచీ కనిపెట్టుకుని ఉన్న ఆగ్రిగేటర్, శోధిని. కాని మనం శోధినిని ఎందుకో అనుసరించలేదు, ఇది నిజం. తెనుగు భాషమీద ఉన్న అశేష అభిమానంతో శ్రమకి,సొమ్ము ఖర్చుకి వెనుకాడక తెనుగువారి సాంస్కౄతిక రాజధాని రాజమహేంద్రవరం నుండి, శ్రీ శ్రీనివాస్ గారు శోధినిని నడుపుతూనే ఉన్నారు. రాజరాజ నరేంద్రుని ముఖ్యపట్టణం,ఆది కవి నన్నయ నడయాడిన నేల, తెనుగులో భారతం మొలకెత్తిన నేలలో, ఉద్భవించిన శోధినిని ఉన్న కొద్ది మంది ఐనా ఉపయోగించుకుందాం.
ఇంకా మనకోసం జిలేబి వదిన సారీ,సారీ జిలేబి వదన చిన్న ఆగ్రిగేటరూ ఉంది,నడుస్తోంది.
ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పుకుందాం. చిన్నగా చినుకుగా మొదలైన బ్లాగులు వాగై,వంకై ఉధృతం గా ప్రవహించి నదియై అనేక మంది బ్లాగర్లను కలిపి కొంతకాలం అలరించిన బ్లాగర్ లు సముద్రంలో కలిసేందుకు ముందు నదిలా చీలిపోయి అనేక మాధ్యమాలలో కొనసాగుతూనే ఉన్నారు, సరస్వతీ నదిలా కనుమరుగైపోయారు.
ఉన్న కొద్దిమంది ఐనా కొనసాగుదాం.
శుభమస్తు.