unadulteratedperfectlyd017afe6a0 తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

వసుంధర అక్షరజాలం;unadulteratedperfectlyd017afe6a0

చాలా మంచి మాట చెప్పారు. నేను ఈ రంగంలోకి కొత్తగా రావడం వల్ల ఇప్పటికే ఉన్న పత్రికల గురించి, WhatsApp లేదా Facebook సమూహాల గురించి, చాలా విషయాలు తెలియవు. ఎక్కడనుంచి మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు. మీ website చాలా ఉపయోగపడుతుంది. ఇంకాస్త నేర్చుకుని, తెలుగు సాహిత్యరంగంలో పేరు, అనుభవం ఉన్న రచయితలు పరిచయం అయ్యాక, నా వంతు కృషి నేను చేస్తాను.


07 June 2026 8:01 PM

వసుంధర అక్షరజాలం;unadulteratedperfectlyd017afe6a0

నేనొక ఔత్సాహిక రచయితను. ఈ కథలు/కవితలు పోటీలు నాక్కూడా కొంత వింతగా అనిపిస్తున్నాయి. చాలా వరకు తెలిసిన పేర్లే మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి. పారదర్శకత మీద కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ, మనం సాటి సాహితీ ప్రియులని, అందునా ఇంత సమయం, ధనం వెచ్చిస్తూ పోటీలు నిర్వహిస్తున్న సహృదయులని నమ్మాలి. లేకుంటే వ్యవస్థలు పని చెయ్యవు.

నానుంచి ఒక చిన్న సలహా. పోటీలకు రచనలు పంపిన ప్రతివారికి, ఒక నాలుగైదు వాక్యాల్లో వాళ్ల రచనగురించి feedback ఇస్తే చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి సిస్టమ్ వల్ల కొత్తవాళ్ళు నేర్చుకుని, ఎక్కువ మంది రచయితలు మనకి లభించే అవకాశం ఉంటుంది. చాలా సార్లు, అసలు మనం పంపిన మెయిల్ వాళ్ళకి అందిందో లేదో కూడా తెలియట్లేదు.


06 June 2026 6:47 AM