Darla తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
మాస్టారూ, మీ అభిప్రాయాలు ఎంతో విలువైనవి. మీరు అక్కడ ఉన్నారు. మీ నుండి కూడా నేను మరింత సమాచారాన్ని తెలుసుకుంటాను. వివిధ గ్రంథాల ద్వారా నేను గ్రహించిన సమాచారాన్ని అప్పుడు రాశాను. నేను ఇప్పుడే మీ కామెంట్ చూశాను. ఈ మధ్య చిట్టెన్ రాజుగారి సంపాదకత్వంలో ఒక వ్యాసం రాశాను. దాన్ని ఒకసారి చూడగలరు. మీ అభిప్రాయానికి నా ధన్వవాదాలు<br />
మీ అభిప్రాయం ఇప్పుడే చదివాను. అది మీకు 'stupid argument' గా అనిపించడంలోనే మా వేదన, మా సంస్కృతి, మా పేరుతో జరిగే దోపిడీ ..వీటి గురించి మీకు కనీస పరిజ్ఞానం లేదని అర్థమవుతుంది. మీలాంటి వాళ్ళు ఇలాంటి వాటిలో 'వేలు' పెట్టకుండా ఉంటే మీ జ్ఞానాన్ని మాలాంటి వాళ్ళు అంచనా వేసే స్థాయికి రాకుండా జాగ్రత్త పడొచ్చు.
సర్, నమస్తే..మీ అభిప్రాయం ఇప్పుడే చదివాను. మీ సూచనలు ఆచరణీయం. ధన్యవాదాలు...మీ దార్ల. 10.1.2022