sarma తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

కష్టేఫలి;sarma

శ్రీనివాస్ జీ,
స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ని మమతమ్మ ప్రభుత్వమే నియమించుకుంది 2025 లో. SEO చేయగలదేం ఉండదు. అంతా రాష్ట్ర ప్రభుత్వం,ఎలక్షన్ కమిషన్ చేసేదే! ఒకటి రెండు నెలల్లో రిటయిర్ అయ్యే గుప్తా గారు మమతమ్మకి కావలసినవాడే సార్! ఇదీ జెన్-జీ లో భాగమేమో సార్!
జెన్-జి మనదేశంలో మొదలయిందనుకుంటున్నాను. జెన్-జి కి వీధుల్లో కొచ్చి అరవక్కరలేదేమో! నిన్న తమిల్నాట జరిగినదీ ఇందులో భాగమే అని నా ఊహ. అనిశ్చిత

13 May 2026 9:27 AM

కష్టేఫలి;sarma

Zilebi12 మే, 2026 1:37 PMకి
నీ కామెంట్ దెబ్బకి కంప్యూటర్ డెస్క్ టాప్ పోయింది.🤔
నీలా నా టపాకి నేనే కాఎంట్ వేసుకోలేదు. కామెంట్ గా రాసినది రాయండమరచినది. దాన్ని మరోటపాలా రాయక,కామెంటులో వేసానంతే!😂 ఇది లేప్ టాప్ తో పడుతున్న చిక్కులు,కొత్తగా ఉంది,ఈ మధ్య వాడక🤣

13 May 2026 9:04 AM

కష్టేఫలి;sarma

కేరళంలో,నేటికి ముఖ్యమoత్రెవరో తేల్చుకోలేని స్థితి కొనసాగొతోంది. అధిష్టానం వేణుగోపాల్ కి మొగ్గుచూపుతోందా? సతీశన్ తానే ముఖ్యమత్రికాక తప్పదంటున్నారు. వీరిద్దరూ కాదు చెన్నితల ను ఎన్నికచేయమటున్నారు,కొందరు. ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు అధికారం చేతికిచ్చి పరిపాలన చేయమంటే ఇలా గొడవలతో గడిపేస్తారా? ముఖ్యమత్రినే తేల్చుకోలేని మీరే చేయగలరయ్యా! అని ప్రజలనుకునే ప్రమాదం ఉందని నెట్ జనులనుకుంటున్నారు. <br

12 May 2026 9:10 AM

కష్టేఫలి;sarma

Zilebi1 మే, 2026 6:16 PMకి
చదవమన్నావు కదా అని అడిగాను. తిప్పలుపడి చదివేటంత సీన్ లేదు😜

02 May 2026 8:44 AM

కష్టేఫలి;sarma

చూడ్డానికి ప్రయత్నం చేసా! సెల్ లో అక్షరాలు కనపడనే లేదు,నలకల్లా ఉన్నాయి.😜

ఇక డెస్క్ టాప్ మీద నిన్న చూసే సావకాశమే లేడు, వేడి దంచుతోంది. ఇప్పుడు చూదామనుకుంటే జూం చేస్తే నలకలు చీమ తలకాయలంతయ్యాయి. ఇంతసైజువి కదలిపోతుంటే చదవడం ఈ వయసులో కుదరలేదు,స్థిరంగా ఉన్న అక్షరాలే చదవడం కష్టమవుతున్న రోజుల్లో చీమలబారులా కదలిపోయే అక్షరాలు....🤣 అదేం చెప్పిందో Text లో రాస్తే చదవగలనేమో.....🤣

01 May 2026 8:55 AM

కష్టేఫలి;sarma

Zilebi30 ఏప్రిల్, 2026 8:03 AMకి
వినపడని వాడికి ఆడియో పోడ్కాస్టులు😂👌😜 మోటుసామెత చెబితే బావోదు 🤣🤣🤣

30 April 2026 8:51 AM

కష్టేఫలి;sarma

మీరిచ్చిన లింక్ లో పేజ్ నాట్ ఫౌండ్ అంటోంది,దీనికేం లెండి.

వాల్మీకి రామాయణం పేరున అనేక వివిధంగా రాసినవీ ఉన్నాయి. నేను పొరబడి ఉండచ్చు.

ఇక్కడ విషయమేమంటే, నేనురాసిన టపాలు మీరు సోర్సు గా ఇస్తే,వాటిలో లేని నిషాదరాజు ,నిషాద సైన్య శబ్దాలు లేకనే మీ ఎల్లెమ్మ వాటిని పైనుంచి తెచ్చి ఇక్కడ గుచ్చింది, కమే (AI) చెప్పినదే ఫైనల్ కాదు,మనం సరి చూసుకోవాలన్నదే నామాట.

29 April 2026 9:02 AM

కష్టేఫలి;sarma

Zilebi28 ఏప్రిల్, 2026 11:34 AMకి
గుహుడు నిషాదరాజని రామాయణంలో ఉన్నట్టులేదు,నాకు తెలిసినంతలో. మన దేశంలో అనేక రామాయణాలున్నాయి, అనేకరకాలుగా రాసినవి. ప్రపంచ మొత్తంలో అనేక రకాల రామాయణాలున్నాయి. మొదట రాయబడిందని నమ్ముతున్న వాల్మీకి రామాయణం మొదటిదని నా నమ్మిక. ఇక రామాయణంలో గుహుడు ఇక్కడే కనపడతాడు,మరెక్కడా కనపడడు. సుమంత్రుడు దూరం నుంచి గుహుణ్ణి చూసి ఆ వచ్చే ముసలాయన ఈ ప్రాంతపురాజు,విజ్ఞానవంతుడు,

28 April 2026 4:59 PM

కష్టేఫలి;sarma

మీరు పంపిన గూగుల్ ఎల్ ఎం చూసాను.
రామునిరాజ్యం భరతుని పట్టం టపాలు నాలుగు భాగాలని కలిపి మీరు తయారు చేసినది బాగుంది. ఐతే ఇందులో నిషాద సైన్యం అనే మాట చూసాను,వాల్మీకి రామాయణం లో ఆ మాటలేదు, ఈ ఎల్లెమ్మ ఎక్కడనుంచి ఈ మాట తెచ్చి ఇందులో గుచ్చిందో చూడండి.
ఇక ఇంటగెలిచి రచ్చ గెలవాలని కదా భరతుని ప్రతిజ్ఞ. దానికోసం ఇంట గెలిచాడు.రచ్చ గెలవడానికి మొదటి మెట్టు గుహునితో రెండవది భరద్వాజ మాహామునితో, ఆపై

28 April 2026 9:09 AM

కష్టేఫలి;sarma

చూసాను.
ధన్యవాదాలు సార్

27 April 2026 9:12 AM

కష్టేఫలి;sarma

చూసాను. పదేళ్ళకితం టపా కాదు పదిహేనేళ్ళేమో!
ధన్యవాదాలు సార్

27 April 2026 9:11 AM

కష్టేఫలి;sarma

పిలక కత్తిరింపుకి శుక్రవారం ముహూర్తం మంచిదేమో సుమా!

కేజ్రీవాల్ దొరకి శుక్రవారమే పిలకత్తిరింపు మహోత్సవం జరిగింది. ప్రతిపక్షం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయ్యో! అన్న పాపానపోయినవాళ్ళవుపడలా! ఒక్క పెద్ద నోటి బంగాలీ భామ తప్పించి. చివరికి కేజ్రీవాల్ దొర గురువు, అన్నాహజారే కూడా రాఘవ్ ఇతరులను తప్పుపట్టలేదు!

ఈ ముహూర్తానికే తెలంగణాలో కామ్రేడ్ చంద్రశేఖరరావు దొరకి పిలక కత్తిరింపు

25 April 2026 6:45 PM

కష్టేఫలి;sarma

Zilebi25 ఏప్రిల్, 2026 11:45 AMకి

సమాధానమిచ్చానే! మెయిల్ కూడా వదన,శోధినిలా ఒంటెద్దు బండయిపోయిందా!

ఈ రోజు ఉదయమే కేజ్రీవాల్ దొరకి, పిలక కత్తిరింపు మహోత్సవం రాఘవ్ ఛద్దా మరొక ఆరుగురు కలసి ఘనంగా జరిపించిన సందర్భంగా వచ్చిన వార్త చూసి టపా ఊరకబోయింది. ఆపేను.

25 April 2026 2:58 PM

కష్టేఫలి;sarma

Zilebi24 ఏప్రిల్, 2026 2:00 PMకి
Notebook lmతెలీదు.
మొదటిది పత్రికావార్తే! రెండవదానికి లింక్ ఇచ్చాను చూడలేదా! ఒక సారి సీకేబుల్స్ పాడు చేస్తే ఎక్కడినుంచి ఎక్కడికి పనిచేసే కేబులొ తెలియదు,పాడుచేసేవారికి. ఆపై మొత్తం నెట్ వర్క్ పనిచేయదు. ఈ సీ కేబుల్స్ కూడా ట్రేడ్ రూట్లలోనే ఉన్నాయి. అదేదో ఐతే శ్రీమద్రమారమణ గోవిందో హరి.....

24 April 2026 5:09 PM

శ్యామలీయం;sarma

శ్రీ మాత్రేనమః🙏
అమ్మను ఎలా తలుచుకున్నా ఆనందమే.
నిత్య పారాయణకు అనువుగా ఉన్నట్టున్నాయి🙏

06 April 2026 8:47 AM

కాదేదీ బ్లాగ్ కు అనర్హం;sarma

నట భీభత్సలను చూశాం కాని కవి భీభత్సలను చూడలేదు. సాహో! ఆస్ట్రేలియా

11 December 2025 9:48 AM

తృష్ణ...;sarma

జీవితమే ఒక తీరని దాహం

22 September 2025 9:51 AM

nmraobandi;sarma

మిత్రమా!
కుశలం తెలిపినందుకు సంతసం.
పెద్ద పెద్ద ఆగ్రిగేటర్ లన్నీ కాలంలో కనుమరుగైపోయాయి. మాలిక నెమ్మది నెమ్మదిగా కనపడకపోయింది. మాలిక మరి కనపడుతుందనే ఆశ సన్నగిల్లింది.

కాని బాగుల్ని మనల్ని కనిపెట్టుకుని ఉన్నది శోధిని మాత్రమే! తెనుగు బ్లాగులకి మిగిలిన ఏకైక ఆగ్రిగేటర్, బ్లాగుల్ని మొదటినుంచీ కనిపెట్టుకుని ఉన్న ఆగ్రిగేటర్, శోధిని. కాని మనం శోధినిని ఎందుకో అనుసరించలేదు, ఇది నిజం. తెనుగు భాషమీద ఉన్న అశేష అభిమానంతో శ్రమకి,సొమ్ము ఖర్చుకి వెనుకాడక తెనుగువారి సాంస్కౄతిక రాజధాని రాజమహేంద్రవరం నుండి, శ్రీ శ్రీనివాస్ గారు శోధినిని నడుపుతూనే ఉన్నారు. రాజరాజ నరేంద్రుని ముఖ్యపట్టణం,ఆది కవి నన్నయ నడయాడిన నేల, తెనుగులో భారతం మొలకెత్తిన నేలలో, ఉద్భవించిన శోధినిని ఉన్న కొద్ది మంది ఐనా ఉపయోగించుకుందాం.

ఇంకా మనకోసం జిలేబి వదిన సారీ,సారీ జిలేబి వదన చిన్న ఆగ్రిగేటరూ ఉంది,నడుస్తోంది.

ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పుకుందాం. చిన్నగా చినుకుగా మొదలైన బ్లాగులు వాగై,వంకై ఉధృతం గా ప్రవహించి నదియై అనేక మంది బ్లాగర్లను కలిపి కొంతకాలం అలరించిన బ్లాగర్ లు సముద్రంలో కలిసేందుకు ముందు నదిలా చీలిపోయి అనేక మాధ్యమాలలో కొనసాగుతూనే ఉన్నారు, సరస్వతీ నదిలా కనుమరుగైపోయారు.

ఉన్న కొద్దిమంది ఐనా కొనసాగుదాం.
శుభమస్తు.

21 September 2025 9:10 AM

nmraobandi;sarma

బయమేస్తాదోయ్ మావ బయమేస్తాదీ

20 September 2025 9:21 AM

nmraobandi;sarma

ఓలమ్మ ఏటిదీ!

అగ్గేస్తాదోయ్ మావ సిగ్గేస్తాదీ

ఇంత కాలం ఏటయినట్టూ! అమ్మ,అబ్బ గుమ్మైపోనాదోయ్ బావు గుమ్మైపోనాదీ

ఒల్లకోరా మావ ఒల్లకో నువు పల్లకుంటే నాకు సల్లగుంటదా? గుంటనురో మావ నీగుంటనురో! నీకు నేను తోడుంటనురో

20 September 2025 9:17 AM